WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' అభిమానులకు ఓకే....!

వేసవిలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'పవన్‌' సినిమా 'కాటమరాయుడు' ఆయన అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పక్కా మాస్‌ లుక్‌తో 'పవన్‌కళ్యాణ్‌' అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తనదైన స్టైల్‌తో 'కాటన్‌' పంచెలతో అభిమానులను ఖుషీ చేయడంలో చాలా వరకు సక్సెస్‌ అయ్యారు. అయితే మూస కథతో పాటు, రొటీన్‌ ట్రీట్‌మ్మెంట్‌ ఈ సినిమాలో ఉన్న ప్రధాన లోపం. మొదటి భాగం అభిమానులను సంతృప్తి పరిస్తే తరువాత భాగమంతా ఉత్సాహం లేకుండా సాగింది. అయితే 'పవన్‌' అభిమానులకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనడంలో సందేహం లేదు.

కథ :
రాయలసీమలోని ఒక ఊరికి పెద్ద కాటమరాయుడు (పవన్ కళ్యాణ్). ఆ ఊరిలో పేదలను పీడించే ధనవంతులకు ఎదురు నిలుస్తూ పేదల బాగు కోసం పనిచేస్తుంటాడు. అలాగే ఆయనకు తన నలుగురు తమ్ముళ్లన్నా ప్రాణం. పెళ్లి చేసుకుంటే తమ మధ్య గొడవలొస్తాయనే భయంతో అతను పెళ్లి కూడా చేసుకోకుండా ఆడవాళ్లకు దూరంగా ఉంటాడు. కానీ అతని నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. దానికి ముందుగా అన్నయ్య పెళ్లి జరగాలని నిశ్చయించుకుని ఆయన్ను అదే ఊరికి పని మీద వచ్చిన అవంతిక (శ్రుతిహాసన్) తో ప్రేమలో పడేలా చేస్తారు.

అలా అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో కాటమరాయుడు, అవంతికల మీద అటాక్ జరుగుతుంది. దాంతో పాటే అవంతిక కుటుంబం పెద్ద ఆపదలో ఉందని కూడా రాయుడికి తెలుస్తుంది. అసలు రాయుడు, శృతిల మీద అటాక్ చేసింది ఎవరు ? అవంతిక కుటుంబానికి పొంచి ఉన్న ఆపద ఏమిటి ? ఆ ఆపద నుండి రాయుడు తన వాళ్ళను ఎలా కాపాడుకుంటాడు ? అనేదే ఈ సినిమా కథ.

సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గి రొటీన్ గా మారిపోయింది. చాలా సినిమాల్లో చూసినట్టు ఒకటే రొటీన్ కథనం. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించవచ్చు. ఒక పాట, ఆ తర్వాత ఒక ఫైట్ అన్నట్టు సాగే ఆఖరి 40 నిముషాల సినిమా అప్పటి వరకు పొందిన ఉత్సాహాన్ని కాస్త దెబ్బతీసింది. ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. దర్శకుడు డాలి ఇక్కడ పాత ఫార్ములానే ఉపయోగించాడు. పైగా ఈ ఎపిసోడ్ టేకింగ్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు.. అంటే పవన్ ఇమేజ్ కు తగ్గ స్థాయిలో లేదు.

ఫస్టాఫ్ వరకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనూప్ రూబెన్స్ సెకండాఫ్ కు వచ్చేసరికి చల్లబడిపోయాడు. అలాగే రావు రమేష్ పాత్ర ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అనుకునేలోపు దాన్ని కాస్త ఫన్నీగా ముగించడం అంత సంతృప్తికరంగా లేదు. ఈ ప్రతికూల అంశాలన్నీ కలిసి సెకండాఫ్ ను సాధారణంగానే మిగిల్చాయి. అలా కాకుండా సెకండాఫ్ కాస్త కొత్తగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇంకొంచెం బలంగా ఉండి ఉంటే సినిమా ఫలితం వేరే స్థాయిలో ఉండేది.


(382)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ