లేటెస్ట్

ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మ‌న్ ప‌దవి...!

సీనియ‌ర్ ఎమ్మెల్యే రోజాకు ఎట్టకేలకు కీలకమైన పదవి దక్కింది. వైసీపీ అధికారంలోకి రావడం తోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందని అంద‌రూ ఊహించారు. కానీ అధినేత జగన్ మంత్రివర్గంలో తీసుకోకుండా పక్కన పెట్టారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె గత కొన్ని రోజులుగా జగన్ కు దూరంగా ఉన్నారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే కార‌ణంతో ఆమె అలిగార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆమెను నిన్న జగన్ పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, సామాజిక సమీకరణాల వల్ల మంత్రి పదవి ఇవ్వలేక పోయానని,  రాబోయే రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని ఈ లోపు ఎపిఐఐసి చైర్మన్ ప‌ద‌వి ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. దీంతో బుధవారం నాడు ఆమెను ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు వచ్చే మంత్రివర్గంలో అయినా హోం మంత్రి పదవి దక్కుతుందని రోజా బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాను పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించానని తన శ్రమ‌ను అధినేత జగన్ గుర్తించారని తనకు మంత్రి పదవి రాకపోయినా జగన్ ముఖ్యమంత్రి అయ్యార‌ని, తాను ఇప్పుడు  ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు.

(297)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ