రియలన్స్ జియోను ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు....మెరుగైన సేవలు అందించి వినియోగదారులను ఆకట్టుకోవాల్సిన ఎయిర్టెల్ సక్రమమైన మార్గాన్ని వదలివేసి... వినియోగదారులను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రత్యేకమైన ప్రకటనలను రూపొందించి వినియోగదారులపై వదులుతోంది. మార్కెట్లో ఎయిర్‌టెల్‌కు ఉన్న పేరును చూసి వినియోగదారులు వారి ఆఫర్ల కోసం వెళితే వారిని నిలువునా ముంచేస్తుంది ఎయిర్టెల్. మార్కెట్పరంగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్న 'ఎయిర్టెల్' చీప్ట్రిక్కులతో వినియోగదారులను దారుణంగా మోసగిస్తోంది. జియో వచ్చిన తరువాత తగ్గిపోతున్న తన మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు వక్రమార్కాలను అన్వేషిస్తోంది. ఉదాహరణకు ఇటీవల ఎయిర్టెల్ ప్రకటించిన ప్యాకేజీలు వినియోగదారులను ముంచేస్తున్నాయి. ఉచితంగా కావాల్సినంత డేటా ఇస్తామంటే ఎగిరి గంతేసిన వినియోగదారులు...చివరకు ఎయిర్టెల్ మోసాన్ని గ్రహించి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఉదాహరణకు రూ.799/- ప్యాకేజ్‌కు 56జిబి(2జిబి ఫర్ డే) మరియు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడి, ఇంటరనేషనల్ రోమింగ్ ఛార్జీలు ఉచితమని ఇది 28రోజులు మాత్రమేనని చివరిలో టిసి(టర్మ్స్ అండ్ కండిషన్స్) అని చెబుతున్నారు. ఈ ఆఫర్ కేవలం మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉంటుందని పదే పదే మెసేజ్‌లు పంపుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. నెలకు రూ.799/-తో కావాల్సినన్ని ఉచిత కాల్స్, కావాల్సినంత డేటా ఎయిర్టెల్ ఇస్తుందంటే నిజమేనని భావించిన వారిని ఎయిర్టెల్ దగా చేస్తుంది. అదే విధంగా రూ.349/- ప్యాకేజీలో 28జీబీ(1జీబీ ఒక రోజుకు) మరియు అన్లిమిటెడ్ కాల్స్ గడువు 28రోజులు అని ప్రకటిస్తున్నారు. అయితే అసలైన వాస్తవం ఏమిటంటే ఈ ఆఫర్ అంతా ఉత్త మోసం...కాల్స్ విషయంలో కంపెనీ తాను ప్రకటించిన ఆఫర్‌ను ఇస్తున్నా...డేటా విషయంలో మాత్రం తన మాటను నిలబెట్టుకోవడం లేదు.
ఈ ఆఫర్లో ఉన్న వినియోగదారుకు అసలు డేటానే రావడం లేదు. దీనిపై ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటున్న మీడియా వర్గాలు సమీపంలో ఉన్న ఎయిర్టెల్ కార్యాలయానికి వెళ్లి మొబైల్ డేటా గురించి ప్రశ్నించగా...వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. చివరకు తమ చేతిలో ఏమీ లేదని సంస్థ పై అధికారులతో మాట్లాడుకోవాలని చేతులు ఎత్తేస్తున్నారు. పోనీ...కాల్స్ వాడుకుంటున్నాంలే...డేటా రాకపోయినా ఫర్వాలేదులే...అని సర్దుకుపోయేవారిపై దిమ్మతిరిగే దెబ్బకొడుతోంది ఎయిర్టెల్. వారి ఆఫర్లో ఉన్న డేటాను వినియోగించుకోకపోయినా... మొబైల్లో ఉన్న సాధారణ బ్యాలెన్స్ నుంచి డేటా ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇదంతా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇది ఎంత దారుణమైన మోసమో...అనుభవంతో కానీ వినియోగదారులకు తెలిసి రావడం లేదు. రిలయన్స్ జియోను దెబ్బ కొట్టాలంటే వినియోగదారులను వారికన్నా మెరుగైన సేవలతో ఆకర్షించాలే తప్ప...తప్పుడు ప్రకటనలతో మోసగించడం...ఎయిర్టెల్ వంటి సంస్థలకు సరికాదు. తమ సంస్థ వినియోగదారుల సంక్షేమానికి కృషిచేస్తుందని పదే పదే ప్రకటించుకుంటున్న ఎయిర్టెల్ ఈ మోసంపై ఎప్పుడు పెదవి విప్పుతారు..?
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ