WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బ్లాక్ మార్కెట్ కు తరలిన టూ వీలర్లు!

 టూ వీలర్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్న వేళ, ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలోకి దిగి తమ సత్తాను చూపడం ప్రారంభించారు. ఒక్కో వాహనంపై రూ. 10 వేల నుంచి రూ. 22 వేలకు డిస్కౌంట్లు లభిస్తున్న వేళ, కస్టమర్లు షోరూములకు పోటెత్తగా, ఎన్నో షోరూముల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. పలువురు వ్యాపారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా, మార్చి 31 తేదీతో ఇన్ వాయిస్ లు తయారు చేసుకుని, తమ వద్ద ఉన్న వాహనాల వివరాలను రాసేసి, వాటిని అమ్ముకున్నట్టు చూపించారని, ఆపై మార్జిన్లు పెంచుకుని వాటిని అమ్ముకోవాలన్నదే వీరి లక్ష్యమని పలువురు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఇన్ వాయిస్ తేదీ 31లోగా ఉంటే, ఆ తరువాత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుండటం, అక్రమార్కులకు కలిసొస్తోందని అంటున్నారు.

(349)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ