WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్ట‌లేని డోర‌...!

పారిజాతం (నయనతార) అనే అమ్మాయి బంధువులతో ఛాలెంజ్ చేసి జీవితంలో ఎదగడానికి తన నాన్నతో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటుంది. అందుకోసం ఒక వెరైటీగా ఉంటుందని ఒక పాత కాలపు కారును కొనుగోలుచేసి బిజినెస్ మొదలుపెడుతుంది. కానీ ఆ కారు కొన్నప్పటి నుండి ఆమెకు సమస్యలు మొదలవుతాయి.తీరా చూస్తే ఆ కారులో ఒక ఆత్మ ప్రవేశించిందని, దాని కోరిక తీరే వరకు అది తనను వదిలిపెట్టదని పారిజాతం తెలుసుకుంటుంది. అసలు ఆ కారులో ప్రవేశించిన ఆత్మ ఎవరు ? అది పారిజాతాన్నే ఎందుకు ఎంచుకుంది ? ఆ ఆత్మ కోరికేమిటి ? చివరికి పారిజాతం ఆ సమస్యకు ముగింపేమిటి ? అనేదే ఈ సినిమా కథ..

ఈ సినిమాకి ప్రధాన బలం నయనతారే అని చెప్పాలి. సినిమా మొత్తం చాలా డీసెంట్ గా, గ్లామరస్ గా కనిపిస్తూ ఆమె ప్రదర్శించిన నటన చాలా బాగుంది. ఆరంభం నుండి చివరి దాకా సినిమాని తన భుజాలమీదే మోసింది నయన్. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో నడిచే అపరిచితుడు తరహా సన్నివేశంలో, సెకండాఫ్లో తన కర్తవ్యాన్ని నిర్వహించే సన్నివేశాల్లో ఆమె నటనను చూస్తే లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఆమెకు సరైందనే అనిపిస్తుంది. ఇక కథ విషయానికొస్తే టైటిల్ పోస్టర్ చూడగానే ఇదొక కారులో దూరిన ఆత్మ కథ అని ఇట్టే అర్ధమయినా కూడా ఆ ఆత్మ ఎవరిదనే చిన్న విషయం మంచి థ్రిల్ ను ఇస్తుంది.అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే ఆ ఆత్మ కథ కూడా కాస్త ఎమోషనల్ గా కనెక్టవడమే కాక రీజనబుల్ గా కూడా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు దాస్ రామసామి కథలోని నయనతార, కారును ఆవహించిన ఆత్మ, పోలీసులు అనే మూడు ప్రధానమైన అంశాలను చాలా తెలివిగా కనెక్ట్ చేస్తూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేని కథనాన్ని రాసుకుని అంతే బాగా దాన్ని తెరపై ఆవిష్కారించాడు. అలాగే కారులో ప్రవేశించిన ఆత్మ కారుతో చేసే పనులను కూడా ఆసక్తికరంగా చిత్రీకరించి ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు దర్శకుడు.

హార‌ర్ సినిమాల‌కు పాయింట్‌గా చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయినా టైట్ స్క్రీన్‌ప్లే, భ‌యం పుట్టించే రీరికార్డింగ్ ప్రాణం పోస్తాయి. ఈ సినిమాలో అవి రెండూ క‌నిపించ‌లేదు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. స్క్రీన్ ప్లే కూడా చ‌ప్ప‌గా ఉంది. డైలాగులు కూడా కృత‌కంగా అనిపిస్తాయి. న‌య‌న‌తార గ్లామ‌ర్‌ని ఎలివేట్ చేసే స‌న్నివేశాలు క‌నిపించ‌వు. ఆమె న‌టించిన `నేను రౌడీనే` సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు గుర్తుకొస్తాయి. జంతువులు ప‌గ‌ప‌ట్ట‌డం అనేది తెలుగు సినిమాకు కొత్త కాదు. త‌న య‌జ‌మానికి జ‌రిగిన అన్యాయానికి శున‌కాలు ప‌గ‌బ‌ట్ట‌డం అనేది పాత కాన్సెప్ట్. కార్లలో ఆత్మ‌లు చేరి వాటికి కావాల్సిన వాటిని ఎలా సాధించాయ‌నే కాన్సెప్ట్‌తో కారు దిద్దిన కాపురం, మెకానిక్ మావ‌య్య వంటి చిత్రాల్లో ఎప్పుడో చూపించేశారు. ఇందులో శున‌కం ఆత్మ ప‌గ‌బ‌ట్టిన‌ట్టు చూపించారు. దాన్ని అయినా ఆక‌ట్ట‌కునేట‌ట్టు చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు ఒక‌ర‌కంగా విఫ‌ల‌మైన‌ట్టే. దోపిడీల‌కు, హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ముఠా కోసం ప్ర‌య‌త్నించిన పోలీసులు క్లైమాక్స్ లో ఎందుకు క‌నిపించ‌రో అర్థం కాదు.

(369)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ