WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫలించిన 'రాయపాటి' బుజ్జగింపులు...!

దిగి వచ్చిన 'చింతమనేని'...!

సిఎంను కలసి ఇబ్బందులు చెప్పిన ఎమ్మెల్యే...!

మంత్రి పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి, విప్‌ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే 'చింతమనేని ప్రభాకర్‌' కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 'చింతమనేని'ని  నర్సరావుపేట ఎంపి రాయపాటి  సాంబశివరావు తనదైన శైలిలో బుజ్జగించి సిఎం వద్దకు తీసుకెళ్లడంతో సఫలీకృతులయ్యారు. తీవ్రమైన అసంతృప్తితో ఉన్న 'ప్రభాకర్‌' ఒక దశలో తాను సిఎంను కలిసేది లేదని భీష్మించు కున్నారట. దీంతో 'రాయపాటి' ఆయనకు పలుసార్లు నచ్చచెప్పారని తెలుస్తోంది.రాజకీయాల్లో ఇటువంటి సహజమేనని, అంత మాత్రం చేత ఈ విధమైన మొండి వైఖరితో వ్యవహరించాల్సిన అవసరం లేదని, నీకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చుని సూచించారు. దీనికి మెత్తబడని 'చింతమనేని' తాను పట్టినపట్టు వదలకుండా వ్యవహరించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా తానేం బాధపడలేదని...!పార్టీనీ, అధ్యక్షుడు చంద్రబాబును పలుసార్లు దూషించిన 'పీతాని సత్యనారాయణ'కు మంత్రి పదవి ఎలా ఇచ్చారనేదే తన అభ్యంతరమని ఆయన అంటున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడుకు ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని 'రాయపాటి' 'చింతమనేని'కి చెప్పినట్లు తెలుస్తోంది. 

  'కమ్మ' సామాజికవర్గానికి జరుగుతున్న అన్యాయంపై కూడా 'చింతమనేని' 'రాయపాటి'ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై 'రాయపాటి' స్పందిస్తూ ఈ విషయంపై గతంలోనే తాను పలుసార్లు దీనిపై మాట్లాడానని, ఓపికగా వ్యవహరించాలని, చంద్రబాబు అందరి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారట. అప్పటికీ మెత్తబడని 'ప్రభాకర్‌' సిఎంను కలవడానికి నిరాకరించారట. దీంతో 'రాయపాటి' ఏలూరు వెళ్లడానికి సిద్ధమయ్యారట. 'నన్ను ఏలూరు రమ్మంటావా...? లేక 'నీవు విజయవాడ వచ్చి సిఎంను కలుస్తావా...? అని 'రాయపాటి' అడగడంతో దిగివచ్చిన 'చింతమనేని' 'గురువు గారూ...మీరు రావడం ఎందుకు...? నేనే విజయవాడ వస్తాను...అని చెప్పినట్లు తెలుస్తోంది. 'రాయపాటి'కి ఇచ్చిన మాట కోసం సోమవారం ఉదయాన్నే 'ప్రభాకర్‌' సిఎం చంద్రబాబును కలసి తన ఇబ్బందులను వివరించారు. మొత్తం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్న 'చింతమనేని' చివరకు 'రాయపాటి' పెద్దరికాన్ని గౌరవించి సిఎంను కలవడానికి అంగీకరించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.అంతకు ముందు 'చింతమనేని' బుజ్జగించేందుకు రాజ్యసభ సభ్యుడు 'గరికపాటి రామ్మోహన్‌రావు' ప్రయత్నించి విఫలమయ్యారు. మొదట 'గరికపాటి'ని 'చంద్రబాబు' దూతగా 'చింతమనేని'ని ఆయన వద్దకు పంపించారు. కానీ 'గరికపాటి' మాటలను 'చింతమనేని' పెద్దగా పట్టించుకోలేదట. దీంతో 'సిఎం' 'రాయపాటి'ని తన ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. సిఎం అప్పచెప్పిన పనిని 'రాయపాటి' సంపూర్ణంగా పూర్తి చేశారు. 

(6215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ