WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

50ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కావ‌డం లేదు...!

ఇప్పటికే జపాన్‌లో వృద్ధుల జనాభా అధికంగా ఉండటం.. చిన్నారులు సంఖ్య తక్కువ ఉండటం పట్ల ఆందోళన చెందుతున్న దేశ ప్రభుత్వం యువత వివాహం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు.. జరుగుతున్న పరిణామాలు చూసి మరింత ఆందోళనకు గురవుతోంది. జపాన్‌లో ప్రతి నలుగురులో ఒకరు 50ఏళ్లు వచ్చే వరకు వివాహం గురించి ఆలోచించట్లేదట. ఈ విషషయం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ అండ్‌ సోషల్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. దేశ జనాభా లెక్కింపులో భాగంగా ఈ సంస్థ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి సర్వే నిర్వహిస్తుంది. తాజా సర్వేలో గత సర్వేతో పోలిస్తే 50 ఏళ్ల వరకు వివాహం చేసుకోకుండా వేచి చూస్తున్నవాళ్లు మగవారిలో 3.23శాతం.. మహిళల్లో 2.45శాతం పెరిగారట.యువతకు వివాహం చేసుకోమని కుటుంబం నుంచి గానీ.. సమాజం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండకపోవడం వల్లనే 50ఏళ్లు వచ్చినా బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మగవారిలో ప్రతీ నలుగురిలో ఒకరు.. మహిళల్లో ప్రతీ ఏడుగురిలో ఒకరు వివాహం చేసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారట. స్వతంత్రంగా జీవించాలని కోరుకోవడం.. ఉద్యోగాల్లో ఇబ్బందులు.. ఒత్తిళ్ల వల్ల వివాహం గురించి ఆలోచించట్లేరట. కొందరు వివాహం చేసుకోవాలని భావించినా సంబంధాలు దొరక్క.. ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం చేసుకోలేకపోతున్నారట. అందుకే ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగం.. కుటుంబం రెండు సమన్వయపర్చుకునే పరిస్థితుల్ని కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. 

(359)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ