WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ముగ్గురు ఐపిఎస్‌ల బదిలీలు ఖాయమా...?

గుంటూరు రేంజ్‌ ఐజి సంజయ్‌, అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీ, రూరల్‌ ఎస్పీ నారాయణ్‌నాయక్‌లను బదిలీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. వీరు గత రెండేళ్ల నుంచి బాధ్యతలు నిర్వహిస్తుండడంతో వారిని బదిలీ చేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఐజి సంజయ్‌, అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీలను బదిలీ చేసినా రాజకీయ వర్గాలు పట్టించుకునే పరిస్థితిలో లేవు. రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ను బదిలీ చేయకుండా మెజార్టీ అధికార ప్రతినిధులను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయంపై వ్యాఖ్యానించేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. గుంటూరు రేంజ్‌ ఐజి సంజయ్‌,అర్బన్‌ ఎస్పీలను బదిలీ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నా అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీని బదిలీ చేయాలని కింది స్థాయి పోలీసు అధికారులతో పాటు, రాజకీయ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. 

రూరల్‌ ఎస్పీ నాయక్‌ను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయరని ఆయన బదిలీకి తాము ఒప్పుకోమని, ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఇటువంటి అధికారిని ఏ కారణంతో బదిలీ చేస్తారని అధికారపార్టీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. నర్సరావుపేట, గుంటూరు ఎంపిలు రూరల్‌ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు 'నాయక్‌'ను బదిలీ చేయవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్‌ ఐజి సంజయ్‌, అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీని బదిలీ చేసి 'నాయక్‌'ను మరి కొద్ది కాలం ఇక్కడే ఉంచే అవకాశం ఉందని పాలకప్రముఖులు మీడియా వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాయి.

(468)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ