WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇక రోజు వారీ ఇంధ‌న ధ‌ర‌లు....!

ఇంధన ధరలను రోజువారీగా సమీక్షించాలని ప్రభుత్వ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రదాన్‌ మాట్లాడుతూ.. నిపుణుల సిఫార్సుల మేరకే రోజువారీ సమీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద మే 1 నుంచి ఐదు నగరాల్లో రోజువారీ ఇంధన ధరల సమీక్షను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, పుదుచ్చేరి, ఉదయ్‌పూర్‌, జంషెద్‌పూర్‌, చండీగఢ్‌లో ఈ ధరల సమీక్ష అమలవుతుందని చెప్పారు. దీని తర్వాతే దేశవ్యాప్తంగా సమీక్షించాలో లేదో నిర్ణయం తీసుకుంటామన్నారు.ఈ మేరకు కేంద్ర చమురుశాఖ మంత్రిధర్మేంద్ర ప్రదాన్‌ వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ దాదాపు 90శాతం రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ రోజువారీ సమీక్ష నిర్వహించనున్నాయి. వీటితో పాటు రిలయన్స్‌, ఎస్సార్‌ సంస్థలు కూడా సమీక్ష నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం 15 రోజులకోసారి ఇంధన ధరల సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం కొత్తేమీ కాదని.. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో రోజువారీ సమీక్ష విధానం ఉందని నిపుణులు చెబుతున్నారు.

(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ