WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మే 25న ప్ర‌గతిభ‌వ‌న్ ను ముట్ట‌డించ‌నున్న జ‌ర్న‌లిస్టులు...!

పోరాడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి నానాటికి దిగజారుతున్నదని ఆఖరికి గుర్తింపు కోసం ఇచ్చే అక్రిడేషన్లు మొదలుకుని హెల్త్ కార్డులు, ఇళ్ళ స్థలాలు తదితర ఎన్నో సమస్యలను సాధించుకునే క్రమంలో ప్రభుత్వం కళ్ళు తెరిపించి జర్నలిస్టుల హక్కులను సాధించుకోవడానికి మే 1 నుంచి మే 25 వరకు తలపెట్ట బోయే పోరాటానికి సంబంధించిన ఇరవై ఐదు రోజుల ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణా జర్నలిస్టుల జెఏసీ కన్వీనర్ నారగౌని పురుషోత్తం తెలిపారు. దీనికి సంబంధించిన ఉద్యమ క్యాలెండర్ ను జర్నలిస్టుల జేఏసీ విడుదల చేసింది. జర్నలిస్టుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఐదు మాసాలుగా అక్రిడేషన్లు మరియు ఇతర జర్నలిస్టుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నది జర్నలిస్టుల జేఏసీ. జీవో 239 రద్దు చేసి అందరికి అక్రిడేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టుల ఇతర హక్కులు మరియు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 25 రోజుల ఏకబిగి ఉద్యమ పంథాను ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే నుండి ప్రారంభించి మే 25 ప్రగతి భవన్ ముట్టడి వరకు వివిధ ఉద్యమ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని జర్నలిస్టుల జేఏసీ నిర్ణయించింది. ఔరేక్ ధక్కా అక్రిడేషన్ పక్కా అనే నినాదంతో ముందుకెళ్ళాలని జేజేఏసీ కోర్ కమిటీ తీర్మానించింది. 

  ఇందులో భాగంగా మే 1 న అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ఎదురుగా మరియు రాజధాని నగరంలో కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఎదురుగా ధర్నా, మే 2 మరియు మే 3న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులను ఘెరావ్ చెయ్యడం, తదనంతరం వారికి గులాబీ పూలతో పాటు పెన్నులు ఇచ్చి వారిని మన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని వినతి పత్రాలు ఇవ్వడం, మే 4న రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డిపీఆర్వో కార్యాలయాల ముట్టడి, హైదరాబాద్ లో సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయం ముట్టడి, తదనంతరం సిబ్బందికి గులాబీ పూలు మరియు పెన్నులు ఇచ్చి నిరసన వ్యక్తం చేయడం, మే 5న అన్ని జిల్లా కేంద్రాలలో మరియు రాజధాని నగరంలో మానవహారాలు, మే 6 నుంచి మే 10 వరకు ప్రతి జిల్లాలోజర్నలిస్టుల సమస్యలతో కూడిన కనీసం లక్ష కరపత్రముల పంపిణీ మే 11న హైదరాబాద్ నగరంలో "దగాపడ్డా జర్నలిస్టు - ధూం..ధాం.." కార్యక్రమంనిర్వహిస్తున్నట్లు తెలిపారు.అలాగే మే 12 నుంచి మే 14 వరకు మన హక్కుల సాధనలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు (టీ.ఆర్.ఎస్.తో సహా) అన్ని మీడియా సంస్థలు, పత్రికల యాజమాన్యాలను కలిసి మద్దతు కోరడం, మే 15న సుమారు వెయ్యి మంది జర్నలిస్టులతో "చలో ఢిల్లీ" కార్యక్రమం, మే 16 న వెయ్యిమంది జర్నలిస్టులచే జంతర్ మంతర్ వద్ద నిరసన ధీక్ష , మే 17న "సంక్షోభంలో తెలంగాణా పాత్రికేయం" జాతీయ సెమినార్ (ఇందులో వివిధ జాతీయ జర్నలిస్టు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొనేలా సెమినార్ రూపకల్పన), మే 18న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ పనితీరు పై ప్రెస్ కౌన్సిల్, మరియు ఇతర జాతీయ నాయకలకు విజ్నాపన పత్రాల సమర్పణ, మే 19న సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు పనితీరు పై DOPT భారత ప్రభుత్వం మరియు అఖిల భారత ఐ.ఏ.ఎస్. అధికారుల సంఘానికి ఫిర్యాదు, మే 21న రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ మెంబర్ల ఇళ్ళ ముందు డప్పుల మోత, మే 22న గవర్నరు జోక్యం కోరుతూ రాజ్ భవన్ కు జర్నలిస్టుల ర్యాలి, అనంతరం గవర్నరుకు ఫిర్యాదు, మే 23న " రాష్ట్ర సాధనలో తెలంగాణా జర్నలిస్టులు - వారి భవిష్యత్తు " సెమినార్, హైదరాబాద్ లో, మే 24న రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టుల అర్ధ నగ్న ప్రదర్శన మరియు అంబేద్కర్ విగ్రహాలకు విజ్నాపన పత్రాల సమర్పణ, మే 25 రోజున ప్రగతి భవన్ ముట్టడి ఈ విధంగా 25 రోజుల చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించాలని జేఏసీ కోర్ కమిటీ తీర్మానించినట్లు తెలిపారు.ఈ ఉద్యమంలో అందరిని భాగస్వాములను చేయడానికి జర్నలిస్టుల జేఏసీ రాష్ట్ర సభ్యులు, జిల్లా కమిటీల బాధ్యులు తగు చర్యలు తీసుకోవలిసిందిగా కోరడమైనది. అలాగే ఈ ఉద్యమం జరిగే 25 రోజులు జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన వలిసిందిగా కోరడమైనది.

(627)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ