నెలవారీ నివేదికను విడుదల చేసిన Facebook
భారతదేశంలో కొత్త ఐటి నిబంధనలకు అనుగుణంగా Facebook తన మొదటి నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఫేస్‌బుక్ కంటెంట్ వర్గాలలో క్రియాశీల పర్యవేక్షణ మరియు చర్య రేటును 95 శాతానికి పైగా నివేదించింది, ఇన్‌స్టాగ్రామ్ చాలా సందర్భాలలో ప్రోయాక్టివ్ పర్యవేక్షణ మరియు చర్య రేటును 80 శాతానికి పైగా నివేదించింది.
Facebook పర్యవేక్షించే వాటిలో నగ్నత్వం, ద్వేషపూరిత ప్రసంగాలు, ఉగ్రవాద ప్రచారం, ఆత్మహత్య & స్వీయహింస, హింసాత్మక మరియు గ్రాఫిక్ కంటెంట్, డ్రగ్స్ మరియు స్పామ్ మొదలైనవి ఉన్నాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నెలవారీ నివేదిక ప్రకారం, స్పామ్‌ను మినహాయించి చాలా కంటెంట్ పై చురుగ్గా పర్యవేక్షిస్తోంది. Facebook మరియు ఇన్‌స్టాగ్రామ్ రెండూ బెదిరింపు మరియు వేధింపుల కంటెంట్ విషయంలో చురుగ్గా వ్యవహరించడం లేదని, ఆయా సంస్థలు ప్రకటించిన నివేదికలను బట్టి అర్థం అవుతోంది. బెదిరింపు మరియు వేధింపుల విషయాలపై 37 శాతం చర్య తీసుకున్నట్లు ఫేస్‌బుక్ నివేదించగా, ఇన్‌స్టాగ్రామ్ 43 శాతం చర్య తీసుకుంది.కొత్త ఐటి చట్టం ప్రకారం, పెద్ద సోషల్ మీడియా కంపెనీలు ప్రతి నెలా సమ్మతి నివేదికలను ప్రచురించాల్సిన అవసరం ఉంది, అందుకున్న ఫిర్యాదుల వివరాలను మరియు తీసుకున్న చర్యలను పేర్కొనాల్పిన అవసరం ఉంది.