WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కెసిఆర్ పాల‌న బాగుంది:ముద్ర‌గ‌డ‌

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తక్కువ సమయంలో అమలు చేశారని కాపు రిజర్వేషన్‌ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశంసించారు ఎన్నికల హామీలు చిత్తుకాగితాలు కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు దేశంలో కెసిఆర్‌ ఒక్కరు మాత్రమే రుజువు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎటువంటి ధర్నాలు, రాస్తారోకలు, నిరశన కార్యక్రమాలు లేకుండా చేయడం చాలా గొప్ప విషయమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్రాసిన లేఖను ఆయన పత్రికలకు విడుదల చేశారు. 

గిరిజన సోదరులకు రిజర్వేషన్లు ఇవ్వడం, ముస్లిమ్‌ సోదరులకు బిసి రిజర్వేషన్‌ను ఇవ్వడం కోసం రెండు కమిషన్లు వేయడం, రిపోర్టు తెప్పించుకుని కేబినెట్‌లో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపటం చూస్తుంటే అణగారిన వర్గాలకు రిజర్వేషన్‌ల కోసం పాటుపడ్డ దళిత మహానుభావుడు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ బాటలో కెసిఆర్‌ ప్రయాణం మరువలేనిదని లేఖలో కితాబునిచ్చారు. నమ్మి ఓట్లు వేసిన ఓటర్లను గౌరవించాలని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిరిగా ఇచ్చిన హామీలు అడిగిలే లాఠీలతొ కొట్టించి, అక్రమ కేసులు పెట్టి బాధించటం, బూతులు తిట్టించడం వంటి కార్యక్రమాలు తీసుకోవద్దని, పదవులు, ఆస్తులు, జీవితాలు శాశ్వతం కాదని, పేరు ప్రతిష్టలే శాశ్వతమని లేఖలో పేర్కొన్నారు. 

  ప్రజల అవపరాలను గుర్తించి పూర్తిగా న్యాయం చేయాలని, ఎన్నికలలో గౌరవ ఓటర్లను డబ్బుకి, మద్యానికి బానిసలను చేయవద్దని, ఖర్చులేని ఎన్నికలు చేయడానికి ప్రయత్నించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలా కోట్లు ఖర్చుచేసే విధానం పాటించవద్దని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి, దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని, రూపాయి ఖర్చు లేని ఎన్నికలను చేశారనే పేరు కూడా తెచ్చుకోవాలని, శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలవాలని కోరుకున్నారు. కెసిఆర్‌ పాలనకు ప్రశంసలు తెలియచేస్తూ లేఖను ముగించారు.


(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ