WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దేవినేని నెహ్రు క‌న్నుమూత‌...!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూశారు. హైదరాబాద్‌‌‌‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాసవిడిచారు. నెహ్రూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 4:25 గంటలకు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెజవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 

  మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత దేవినేని నెహ్రూ. నెహ్రూకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే దేవినేని ఉమ, టీడీపీ సీనియర్ నేతలు, నెహ్రూ అనుచరులు హైదరాబాద్ బయల్దేరారు. నెహ్రూ మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ మరణంతో తాము ఓ గొప్పనాయకుడిని కోల్పోయామని టీడీపీ నేతలు చెబుతున్నారు.కాగ నెహ్రూ మృతిపట్ల తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి కే చంద్ర శకర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేర్సారు.  ఆయన కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్న నెహ్రూ హఠాన్మరణం చెందడం కలిచివేసిందని అనుచరులు చెబుతున్నారు.

(199)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ