WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రైతులను బిచ్చగాళ్లగా మారుస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తోందని తెతెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో తెదేపా రైతు విభాగం ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కందులు, మిర్చి, పసుపు రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని.. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి పంటకు రూ.8వేల గిట్టుబాటు ధర ఇస్తుంటే... తెలంగాణలో మాత్రం రూ.3-4వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాల పోరాడుతుందన్నారు. ఈ ఆందోళనలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

(182)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ