WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీఆర్ఎస్ అంటే..తెలంగాణ రాబందుల పార్టీ

టీఆర్ఎస్.. తెలంగాణ రాబందుల పార్టీగా మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మధుయాష్కీ, జగ్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతే రాజు ఎలా అవుతాడని వారు అన్నారు. దళారులు, కాంట్రాక్టర్లు, ఫిరాయింపుదారుల పాలన ఇది అని, కల్తీ విత్తన కంపెనీలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్ ఏమైందని, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇసుక దొంగలపై విచారణ జరిపించారా...అని వారు ప్రశ్నించారు. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు మధుయాష్కి ఆరోపించారు. కేసీఆర్ కుమారుడు, కుమార్తె, అల్లుడికి ఈడీ నోటీసులు వాస్తవం కాదా..?అని ఆయన ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇచ్చినట్టు నా వద్ద సమాచారం ఉందని, అందుకే పెద్దనోట్ల రద్దుకు మద్ధతిచ్చారని మధుయాష్కి పేర్కొన్నారు. ఇది నిజమో కాదో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలన్నారు. అలాగే జీహెచ్ఎంసీ రోడ్ల పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

(332)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ