WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రాథమిక పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి

హైదరాబాద్ ఏప్రిల్ 26:: ప్రాథమిక పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మన దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ప్రారంభించారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఓయూ ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. . ఈ సందర్భంగా ఉత్సవాల సావనీర్‌ను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో ఆవిష్కరించారు. శతాబ్ది భవన్‌కు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ,  హైదరాబాద్ మహా నగర మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ శతజంతి ఉత్సవాలకు ఓయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఓయూలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం ఏర్పడింది.ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.  ‘ఓయూ అత్యున్నత విశ్వవిద్యాలయం. వందేళ్ల క్రితం మీర్‌ అలీ ఉస్మాన్‌ ఖాన్‌ దీన్ని ప్రారంభించారు. మీర్ ఉస్మాన్ స్వప్నం నేడు ఇంత వృద్ధి చెందిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఓయూ ‘‘ఓయూ వందేళ్లు పూర్తి చేసుకోవడం స్ఫూర్తిదాయకం. వందేళ్లలో వర్సిటీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విశ్వవిద్యాలయాలు మేధావుల ఆలోచనలకు వేదికగా నిలుస్తాయి. వందేళ్ల క్రితమే ఉన్నత విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచాం. అదేవిధంగా ఉన్నత విద్యకు భారత్ ఎప్పటి నుంచో అంతర్జాతీయ చిరునామా. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్శిటీ ఏర్పాటైంది. 1956లో యూజీసీ ఏర్పాటైందని, నాటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో యూజీసీ ఏర్పాటైందని, యూనివర్శిటీలన్నీ యూజీసీ కిందకొచ్చాయి’’ అని ప్రణబ్ అన్నారు.ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో వందల సంవత్సరాల క్రితమే భారత్‌ ఆదర్శంగా నిలిచింది. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఐఐటీలో చదివిన వారికి వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాయాలు వేదికలుగా నిలుస్తున్నాయి. మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా యూనివర్శిటీల్లో పరిశోధనలు జరగాలి’ అని అన్నారు. గతంలో తాను ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లినప్పుడు అక్కడి డైరెక్టర్‌ను ఎంత మంది విద్యార్థులకు క్యాంపస్ నియామకాలు వస్తున్నాయని అడిగితే దాదాపు నూరుశాతం అని గర్వంగా చెప్పారని, అదే ఎంతమంది విద్యార్థులు మన దేశంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారని అడిగితే మాత్రం కొంతమంది విదేశాల్లో చేస్తున్నారు తప్ప ఇక్కడ దాదాపు ఎవరూ లేరన్నారని రాష్ట్రపతి తెలిపారు. ఈ పరిస్థితి మారాలని, ప్రాథమిక పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మన దేశం ముందుకు వెళ్తుందని చెప్పారు.   మొదటి ప్రపంచయుద్ధం తీవ్రస్థాయిలో ఉండగా యూనివర్సిటీ మొదలైందని,   ఆ తర్వాత 20 ఏళ్లకే మరో ప్రపంచయుద్ధం జరిగింది   గత శతాబ్ది మొదటి 50 ఏళ్లలో రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయని,  ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రపంచం అంతా గాఢనిద్రలో ఉండగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, భారతదేశం సరికొత్త చరిత్రను ఆరంభించింది . మీ సొంత రాష్ట్రంలో కూడా పెద్ద మార్పు జరిగిందన్నారు.  యూనివర్సిటీ అంటే నేర్చుకోడానికి మంచి వేదికే కాదు, ఆలోచనలు పంచుకోడానికి కూడా మంచి అవకాశమన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులు లేకుండా అభిప్రాయాలు పంచుకుంటారు.. ఇది యూనివర్సిటీకి లక్ష్యంగా ఉండాలని,  ఒకటి కాదు.. రెండు కాదు.. వందేళ్ల నుంచి ఆ స్ఫూర్తి ఇక్కడ కొనసాగుతోందన్నారు.

  భారతదేశం 1500-1600 ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో విద్యారంగంలో ముందుందన్నారు.

  15వ శతాబ్దంలోనే నలంద యూనివర్సిటీ ఏర్పాటైంది. తక్షశిల, విక్రమశిల, ఉధంపూర్.. ఇలా చాలా ఉన్నత విద్యాలయాలున్నాయని,  ప్రపంచం నలుమూలల నుంచి మేధావులైన అధ్యాపకులు వచ్చి, విద్యార్థులతో తమ అభిప్రాయాలు పంచుకున్నారన్నారు.  ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏర్పడిందన్నారు.  ఈరోజు ఉన్నత విద్యారంగ మౌలిక సదుపాయాల్లో చాలా అభివృద్ధి సాధించామన్నారు.  మన దేశంలో 757 యూనివర్సిటీలు,  16 ఐఐటీలు, 30 ఎన్ఐటీలు, ఐఐసీఆర్, ఐఐఎంలు.. ఇంకా చాలా ఉన్నాయన్నారు.  ఐఐటీల విషయమే చూడండి.. ఇప్పుడు వాటిలో చాలావరకు నూటికి నూరుశాతం క్యాంపస్ నియామకాలు జరుగుతున్నాయని,  ఐఐటీ పట్టభద్రులు ప్రపంచ మార్కెట్‌లో లీడర్లుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఎన్‌సీలలో వారే అగ్రగాములుగా ఉన్నారన్నారు.  కానీ మనం వాటితోనే సంతృప్తి పడిపోకూడదు   మన యూనివర్సిటీలను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.  ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందని,   గత ఐదేళ్లుగా ప్రతియేటా స్నాతకోత్సవాలకు వెళ్లినప్పుడు నేను ప్రమాణాలు పెంచుకొమ్మనే చెబుతూ వచ్చాను   భారతీయ యూనివర్సిటీలు ప్రపంచంలో అగ్రగాములుగా ఉండాలన్నదే నా తపన అన్నారు.  అన్నింటికీ ప్రభుత్వమే నిధులు ఇవ్వాలంటే కుదరదు.. పారిశ్రామిక వర్గాలు కూడా ముందుకు రావాలని రాష్ట్ర పతి పిలుపునిచ్చారు. పరిశ్రమలకు కూడా పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అవసరమే అవుతుందని,   మార్కెట్ పోటీకి దీటుగా విద్యార్థులు ఎదగాలి

కానీ వీటిని అమలుచేయాలి. అప్పుడు యూనివర్సిటీ మరో మైలురాయిని చేరుకుంటుంది.   మరో పదేళ్లు, పదిహేనేళ్ల తర్వాత మీరు ఇక్కడ ఉండకపోవచ్చు గానీ.. ఓయూ ఇక్కడే ఉంటుంది, మీరు సాధించిన విజయాలుంటాయన్నారు.  తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన దేశ విద్యా వ్యవస్థకు రూపకల్పన చేశారు.  యూనివర్సిటీలలో ఎప్పటికప్పుడు కొత్త శాఖలు రావాలి, కొత్త ప్రాజెక్టులు ఉండాలి, మన మెదడును కూడా అభివృద్ధి చేసుకోవాలని   మీ మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిలో వేటిని సులభంగా పరిష్కరించచ్చు అనేది కూడా చూడాలి   నన్ను ఈ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆహ్వానించిన యూనివర్సిటీ వర్గాలకు ధన్యవాదాలు,  మీకు అన్నిచోట్లా విజయం చేకూరాలని ఆశిస్తున్నాను. ఉస్మానియా వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు గోవా నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేసి, పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, కేశవరావు, త్రివిధ దళాల అధిపతులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్వామిగౌడ్, మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులను ప్రణబ్ ముఖర్జీకి కేసీఆర్ పరిచయం చేశారు.

(140)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ