WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అడిగి చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్న కెసిఆర్....!

వరంగల్‌లో జరిగిన తెరాస సభ పేవలంగా సాగిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలని కేసీఆర్‌ అడిగినా జనం నుంచి స్పందన కరువైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎప్పుడూ చెప్పినట్లే గొర్రెలు.. చేపలు.. కరెంటు ముచ్చట్లు తప్ప కేసీఆర్‌ ప్రసంగంలో ప్రజలను ఆకర్షించే అంశాలేవీ లేవన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రెండు పడకగదుల ఇళ్లు, దళితులకు భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ విద్యా పథకాలను ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎందుకు ప్రసంగించలేదో కేసీఆర్‌ చెబితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... ఆ విషయంపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.

(213)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ