WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాహుబ‌లి తొలి రోజు వ‌సూళ్లు రూ.130కోట్లు...!

భారీ అంచనాలతో విడుదలైన బాహుబలి2 చిత్రం కలెక్షన్లలో జోరు చూపిస్తుంది. తొలి రోజు ఈ మూవీ వంద కోట్లకి పైగా వసూళ్ళు సాధించిందని చెబుతున్నారు. బాలీవుడ్ సినిమాలు కూడా సాధించలేని రికార్డులని బాహుబలి2 సాధించిందని చెబుతున్నారు. ఖాన్ త్రయం ఆమీర్, సల్మాన్, షారూఖ్ ల సినిమాలు తొలి రోజు 80 నుండి 90 కోట్ల వరకే వసూల్ చేయగా, బాహుబలి 2 చిత్రం మాత్రం వాటన్నింటిని దాటి దాదాపు 130 కోట్ల కలెక్షన్లని రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఈ చిత్రం యూఎస్ లో కేవలం ప్రీమియర్ షోలకు మాత్రమే 3 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించడం విశేషం. వారాంతంలో బాహుబలి మరిన్ని వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టనుందని అంటున్నారు. వెయ్యి కోట్ల క్లబ్ లో బాహుబలి 2 చిత్రం చేరడం ఖాయమని మరి కొందరు జోస్యాలు చెబుతున్నారు. ఏదేమైన ఓ తెలుగు సినిమా సాధిస్తున్న ఈ రికార్డులు మనందరికి గర్వ కారణం.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ