WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాహుబలి'కి ముందు...తరువాత...!

ప్రపంచ కాలాన్ని క్రీస్తు ముందు...క్రీస్తు శకం...అన్న విధంగానే భారతీయ సినిమాలను 'బాహుబలి'కి ముందు 'బాహుబలి'కి తరువాత అనే విధంగా పిలుస్తారంటూ సంచలన దర్శకుడు రామ్‌గోపాలవర్మ అభివర్ణించారు. తెలుగు దర్శకుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో ఖాన్‌లు, రోషన్లు, చోప్రాలు మటుయాయం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి గొప్ప దర్శకుడిని వెలుగులోకి తెచ్చిన కరణ్‌జోహార్‌ను అభినందించాలని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమా చూసిన ప్రతి బాలీవుడ్‌ స్టార్‌, స్టార్‌ దర్శకులు వణికిపోతున్నారని అన్నారు. 'బాహుబలి-1' విడుదలప్పుడే రాజమౌళిని ఆకాశానికెత్తేసిన 'వర్మ' ఇప్పుడు మరింతగా ఆయనపై పొగడ్తల జల్లులు కురిపిస్తున్నారు.


(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ