WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'తమన్నా'ను మోసం చేసిన 'రాజమౌళి'...!

దర్శకధీరుడు 'రాజమౌళి' రూపొందించిన చిత్రం 'బాహుబలి-2' ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తుంది. ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటోంది. , దర్శకుడి ప్రతిభ, ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌ల నటన గురించి ప్రశంసల జల్లు కురుస్తోంది. మొదటి భాగం కన్నా రెండో భాగం అత్యధిక వసూళ్లు చేస్తూ ఇండియాలో నెంబర్‌వన్‌ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే మొదటి భాగంలో పనిచేసిన ఓ హీరోయిన్‌ ఇప్పుడు దర్శకుడు రాజమౌళి తనను మోసం చేశారని అంటోందట. తనకు చెప్పింది ఒకటని...చివరకు చేసింది ఒకటని ఆమె ఆరోపిస్తుందట. మొదటి భాగంలో క్రియాశీలకమైన పాత్ర ఇచ్చిన దర్శకుడు చివరి భాగంలో తన పాత్రకు న్యాయం చేయలేదని వాపోతుందట. ఇంతకీ ఎవరా నటి అంటారా...? ఇంకెవరు మిల్కీ బ్యూటీ తమన్నా.

  'బాహుబలి' ప్రథమార్థంలో విప్లవనాయకిగా, ప్రభాస్‌ ప్రేమికురాలిగా సినిమాలో ఆకట్టుకున్న 'తమన్నా' రెండో భాగంలో జూనియర్‌ ఆర్టిస్టులకు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఇవ్వకపోయిన సంగతి తెలిసిందే. అసలు 'తమన్నా' పాత్ర గురించే దర్శకుడు మరిచిపోయాడనే విమర్శలు వస్తున్నాయి. ఒక విప్లవవనితను హీరో ప్రేమికురాలిగా మార్చిన వైనంపైనే గతంలో 'రాజమౌళి'పై విమర్శలు వచ్చాయి. విప్లవవనిత తన లక్ష్యాన్ని మరిచిపోయి హీరోతో శృంగార కార్యక్రమాలకు దిగడం ఏమిటని విమర్శించిన వారు ఉన్నారు. అయితే 'బాహుబలి' విజయంతో ఈ విమర్శకుల ప్రశ్నలు పెద్దగా 'జనం'లోకి వెళ్లలేదు. అయితే ఇప్పుడు 'బాహుబలి-2'లో 'తమన్నా' పాత్రపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆ పాత్ర పూర్వాపరాలు కానీ...ఆమె ఎందుకు విప్లవసైన్యంలో చేరిందనే అంశం కానీ...ఆమెకు 'రానా'పై అంత శతృత్వం ఎందుకు వచ్చిందనే విషయం కానీ కనీసం మాట వరసకైనా ప్రస్తావించలేదు...! మొదటి భాగంలో అంత ప్రాధాన్యత ఇచ్చి...ఇప్పుడు ఎందుకు అర కొరగా చూపించారనే దానిపైనే ఆమె మండిపడిపోతుందట.అసలు వాస్తవానికి రెండో భాగంలో ఆమె పాత్రపై వీరోచితమైన సీన్లు చిత్రీకరించారట. గుర్రపుస్వారీ, కత్తియుద్ధం వంటి రోమాంచిత సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే సినిమా నిడివి మరింత పెరిగిపోతుండడంతో దర్శకుడు ఆ సీన్లను కత్తిరించేశారని తెలుస్తోంది.


(1762)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ