WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రపంచ యుద్ధం వస్తుందా?

 అగ్రరాజ్యాన్ని నాశనం చేస్తానంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా. ఆ దేశ ఆగడాలకు అణుదాడితో అడ్డుకుంటామంటున్న అమెరికా. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న హెచ్చరికలతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? అని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచయుద్ధం రావడం ఖాయమని చెబుతున్నారు మన దేశానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ చెప్పారు. మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలుకానుందని ఆయన జోస్యం చెప్పారు. మే 13వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభంకానుందని ఆయన తేల్చి చెప్పారు.అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన చర్యలకు దిగుతారని ఆయన అన్నారు. ఈ క్రమంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రపంచం మొత్తం కకావికలమవుతుందని చెప్పారు. 

   మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడంటూ గతంలో గౌతమ్ జోస్యం చెప్పారు. దీంతో, ప్రస్తుతం ఈయన చెబుతున్నదాన్ని ప్రపంచ మీడియా హైలైట్ చేస్తోంది. ఇంతకుముందే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు కూడా జూన్ 14వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పినసంగతితెలిసిందే.మరోవైపు తన శిష్యులతో కలసి ఆగ్రాలోని యమునా తీరంలో ప్రమోద్ గౌతమ్ మహా శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హోమం ద్వారా యమున సోదరుడు, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజును ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశామని... తద్వారా యుద్దాన్ని నివారించేందుకు తమవంతు ప్రయత్నం చేశామని చెప్పారు. 

  అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌ అధ్యక్షుడవుతారని ప్రమోద్‌ జోస్యం చెప్పారు. అది నిజమవడంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.‘2017 సెప్టెంబర్‌ వరకు అమెరికాకు ప్రతికూల పరిస్థితులు కన్పిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అంగారక గ్రహం ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా తీవ్ర హింసను ఎదుర్కోనుంది. ఇది యుద్ధానికి దారి తీయనుంది’ అని ప్రమోద్‌ మీడియాతో అన్నారు. అంతేకాకుండా భారత్‌, పాక్‌ మధ్య సంబంధాలపై కూడా ప్రమోద్‌ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన మూడో ప్రపంచ యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

(156)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ