WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

క‌ష్టాన్ని నమ్ముకుని పైకి వ‌చ్చా...!

ఐక్యరాజ్య సమితి ఆవాసం అధ్యక్షుడిగా ఎన్నికవటం దేశానికే గుర్తింపుగా భావిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఐరాస ఆవాసం అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐరాస ఆవాసం అధ్యక్ష పదవిని బాధ్యతగా స్వీకరిస్తుట్లు చెప్పారు. తనకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరని, గాంధీ, నెహ్రూ కుటుంబాల నుంచి రాలేదని.. తమ కుటుంబంలో పెద్దగా ఎవరూ చదువుకోలేదు.. రాజకీయాల్లోకి రాలేదని కేంద్రమంత్రి వెంకయ్యానాయుడు అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఒకటి తాను నమ్ముకున్న సిద్ధాంతం, చేసిన శ్రమ అయితే.. మరొక కారణం తన మిత్రులు, అభిమానులు అందించిన సహకారమేనన్నారు. ఐక్యరాజ్యసమితి ఆవాస సంఘానికి అధ్యక్షుడు కావడమనేది పెద్ద పదవి కాదని.. అరుదైన గౌరవం మాత్రమేనని వెంకయ్యనాయుడు అన్నారువచ్చే రెండేళ్లలో సభ్య దేశాలతో నవీన పద్ధతులపై మాట్లాడతాన్నారు. ఆవాసం కోసం ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు. 2020 నాటికి 60శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తారని అంచనా. గ్రామాల నుంచి పట్టణాలకు రావటం సహజంగా మారిందన్నారు. కావునా పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అందరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.

 అనంతరం హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ సమీపంలో ముచ్చింతల్‌లో చిన్న జీయర్‌స్వామి ఆశ్రమంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.దేశం సంక్షోభం నుంచి బయటపడాలంటే పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని అన్నారు. రసాయన అవశేషాల్లేని సురక్షిత ఆహారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైతులు ప్రకృతి సేద్యం పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు. వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చేయూతగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వయం సమృద్ధి అంటే విదేశాల నుంచి వ్యవసాయోత్పత్తులు దిగుమతి చేసుకోవడం కాదు.. సుస్థిర సేద్యంపై దృష్టిసారించాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ సూచించారని వెంకయ్య గుర్తుచేశారు. ఈ నెల 21 వరకు ఈ శిబిరంలో ప్రకృతి వ్యవసాయ శిక్షకులకు సుభాష్‌ పాలేకర్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్‌ స్వామి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ