WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇక ఆదివారం పెట్రోల్ బంకులు ఉండ‌వు...!

మే నెల 14వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు బంద్ కానున్నాయి. ఎనిమిది రాష్ర్టాల్లో(మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి) 20 వేల పెట్రోల్ బంక్‌లు ఆదివారం నాడు మూతపడనున్నాయి. ఈ విషయమై ఇండియన్ పెట్రోలియం డీలర్స్ ఎక్స్‌క్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ స్పందిస్తూ.. కొన్ని సంవత్సరాల క్రితమే పెట్రోల్ ఔట్‌లెట్స్‌ను ప్రతీ ఆదివారం మూసివేయాలనుకున్నాం. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల విజ్ఞప్తిపై స్పందించి ఇంతకాలం అమలు చేయలేదన్నారు.ప్రధాని ఇటీవల చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు ఇంధన ఆదా పాటించాలన్న వ్యాఖ్యలను సైతం పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మామూలు పనిదినాల్లోనైతే పెట్రోల్ బంక్‌లో 15 మంది సిబ్బంది వరకు పనిచేస్తుంటారు. అదే మే 14 నుంచి ప్రతి ఆదివారం అత్యవసర పరిస్థితుల్లో ఉండే వాహనాలకు మాత్రమే పెట్రోల్ అందించేందుకు బంకుల్లో ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉంటారని తెలిపారు.

(234)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ