WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్రగడ'కు నైతికహక్కు లేదు...!

కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు ముద్రగడకు లేదని ఎమ్మెల్సీ సతీష్‌ప్రభాకర్‌ దుయ్యబట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు గతంలో కాపులను ఓటుబ్యాంక్‌గా వాడుకున్నాయని, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే కాపుల సంక్షేమంపై దృష్టిసారించారని అన్నారు. ఎన్నిపార్టీలు వచ్చినా, ఎంత మంది పాదయాత్రలు చేసినా కాపు ఓటర్లు చంద్రబాబుకే మద్దతు ఇస్తారే తప్ప...ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వరని 'అన్నం' చెప్పారు. మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని 'ముద్రగడ' తెలపడంపై 'సతీష్‌' అభ్యంతరం చెప్పారు. మరి కొన్ని నెలల్లో కాపులను బిసీలో చేరుస్తారని తెలిపారు. కాపు సామాజికవర్గానికి చెందిన తనను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, తాను స్వల్పతేడాతో ఓడిపోయినప్పటికీ తనను ఎమ్మెల్సీ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నం చెప్పారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ముద్రగడ కల్లబొల్లి మాటలు నమ్మరని, టిడిపి ప్రభుత్వానికి మళ్లీ మద్దతు ఇఛ్చి అధికారంలోకి తీసుకురావడం ఖామని సతీష్‌ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది కాపులకు రుణాలు అందాయని, ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లేందుకు సహాయం చేసిన విషయాన్ని ముద్రగడ గుర్తించాలని, రెచ్చగొట్టే ప్రకటనలు మాని కాపుల సంక్షేమానికి కృషి చేయాలని అన్నం కోరారు.

(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ