WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్టీఆర్‌ కు ఘననివాళి

హైదరాబాద్‌ మే 28:: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద వీరంతా పూలు వేసి అంజలి ఘటించారు. హరికృష్ణ, రామకృష్ణ, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్‌, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు, లక్ష్మీపార్వతి తదితరులు ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. ఉదయం నుంచి ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు ఒక్కక్కరూ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు, రాష్ట్రానికి, సినీ పరిశ్రమకు చేసిన సేవలను స్మరించుకున్నారు.

(261)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ