లేటెస్ట్

‘అయ్యన్న’ అరెస్టు అయ్యేపనికాదా..?

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఏదో విధంగా అరెస్టు చేసి, జైలులో వేసి ముప్పుతిప్పలు పెడదామనుకున్న ప్రభుత్వ పెద్దలకు ఏదో ఆటంకం ఎదురవుతోంది. తనపై పరుషపదజాలంతో వ్యాఖ్యలు చేశారని మండిపడుతోన్న ‘జగన్‌’ అయ్యన్నను ఇరికించాలని భావిస్తున్నారు. మొదట్లో అయ్యన్న తమ్ముడిని తన పార్టీలో చేర్చుకుని, చిన్నపాటి పదవి ఇచ్చినా దాని వలన పెద్దగా ఒరిగిందేమీ లేదు. దీంతో ఆయనపై ఏదో విధంగా చర్యలు తీసుకోవాలని భావించిన ‘జగన్‌’కు  ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆయన మంత్రివర్గ సహచరులపై చేసిన వ్యాఖ్యలతో అవకాశం దొరికింది. ఏదో ఒక కేసు ‘అయ్యన్న’పై పెట్టి ఇబ్బంది పెట్టాలనుకున్న ‘జగన్‌’ అయ్యన్నను అరెస్టు చేయాలనుకున్నప్పటికీ మాజీమంత్రి అయ్యన్నపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశం ఇవ్వడంతో ‘జగన్‌’ కోరిక నెరవేరలేదు. మంత్రులు, అధికార ప్రజాప్రతిధులు, కొందరు అధికార ముఖ్యనేతలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌పై ఎన్నో అసభ్యవ్యాఖ్యలు చేసినా పట్టించుకోని పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి జగన్‌పై చిన్నపాటి విమర్శలు చేసినా కేసులు పెట్టడం, ఆ తరువాత వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం, న్యాయస్థానాలతో మెట్టికాయలు తినడం వారికి అలవాటుగా మారింది. ఏది ఏమైనా ‘అయ్యన్న’ విషయంలో సిఎం జగన్‌ తొందరపడ్డారని అధికారనేతలే తెరవెనుక చెబుతున్నారు. ‘అయ్యా ముఖ్యమంత్రిగారూ..మా అధినేత ‘చంద్రబాబు’పై మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఘోరమైన విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి మీకు తెలుసు. ఆ విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని మీరు మందలించకుండా ప్రజాస్వామ్యాన్ని మంటకలుపుతున్నారు. మీపై చిన్న విమర్శలకే కేసులు పెట్టిస్తున్నారు. ఈ విషయంలో ‘జగన్‌’ తన తీరును మార్చుకోవాలని ‘అయ్యన్న’ పలుసార్లు సూచించినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ