లేటెస్ట్

ఎపి గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషన్‌ హరిచందన్‌ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్‌ నరిసింహన్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఆయనను తెలంగాణకు పరిమితం చేస్తూ...హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు మరి కొందరి పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బిశ్వభూషణ్‌ ప్రముఖ న్యాయవాది. ఆయన జనసంఘ్‌, జనతాపార్టీలో పనిచేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆణన జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తరువాత బిజెపిలో చేరిన ఆయన 1980 నుంచి 1988 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన బిజద-బిజెపి సంకీర్ణప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

(295)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ