WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శ్రీకాంత్‌'ను బదిలీ చేయాలి...!

తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉద్యోగవర్గాల్లో వ్యతిరేకత పెంచేందుకు కుట్ర జరిగిందని, దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం తీసుకోలేదు...సంబందించిన ఫైల్‌ను ముఖ్యమంత్రికీ పంపలేదు...మంత్రివర్గానికి నివేదించలేదు..కానీ ముందుగానే ఉత్తర్వులు తయారు చేయటమే కాకుండా అందుకు సంబంధించిన కాపీలను లీక్‌ చేయడం జరిగింది. ఈ లీకులు వెనుక జిఎడి పొలిటికల్‌ కార్యదర్శి 'శ్రీకాంత్‌' ప్రమేయం ఉన్నా లేకున్నా ఆయనే దీనికి పూర్తి బాధ్యుడని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏ ఒక్కరి ఆమోదం తీసుకోకుండానే ఉత్తర్వు కాపీలను, సంబంధించిన ఫైల్‌లో ఉంచుతారు.'శ్రీకాంత్‌' అతిగా వ్యవహరించడమే దీనికి కారణమని ఆయన అత్యుత్సాహమే దీనికి కారణమని సచివాలయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 

   కలసి వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా చేజేతులారా చేతులు కాల్చుకుని విమర్శలు పాలవుతున్నారు ఆయన.    నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమించినా,సిఆర్‌డిఎ ప్రత్యేక కమీషనర్‌గా నియమించినప్పటికీ ఆయన సక్రమంగా బాధ్యతలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమయ్యారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు 'శ్రీకాంత్‌'ను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు గంటల పాటు వారిని ఎదురు చూసేటట్లు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలే ఆయన పోస్టు పోవడానికి కారణమయ్యాయి. 'సాక్షి' పత్రికకు లీక్‌ ఇచ్చిన వ్యవహారంలో 'లా' విభాగంలో పనిచేసే ఒక మహిళా అధికారితో పాటు జిఎడి పొలిటికల్‌ విభాగంలో పనిచేసే క్రిందిస్థాయి అధికారి ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. సంబంధించిన కాపీలను కంప్యూటర్‌ నుంచి బయటకు తీసిన కింది స్థాయి అధికారిని ఎవరు ఏ విధంగా మోసం చేశారో...ప్రలోభపెట్టారో తెలియదు కానీ...శ్రీకాంత్‌ తయారు చేసిన జిఓ వివరాలు 'సాక్షి'కి అందాయి. డ్రాప్టు జిఓను అందజేయటంలో 'జగన్‌' పార్టీకి చెందిన కిందిస్థాయి అధికారుల ప్రమేయం ఉందని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇంటిలిజెన్స్‌ వర్గాలు కూడా దీనిపై ఆరా తీస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా శ్రీకాంత్‌ అతిగా వ్యవహరించి ఉద్యోగ వర్గాల్లో ముఖ్యమంత్రిపై వ్యతిరేకత వ్యక్తం కావడానికి ముఖ్యకారకులుగా మారారని ఆయనను వెంటనే అక్కడ నుంచి తప్పించితే ఉద్యోగుల ఆవేశాన్ని కొంత వరకు తగ్గించవచ్చునని మంత్రులు కూడా అభిప్రాయపడుతున్నారు.

(203)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ