WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆయిల్‌మాఫియా'కు మంత్రి సోమిరెడ్డి అండ...!?

మంత్రిగా 'సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి' బాధ్యతలు స్వీకరించిన తరువాత నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఆయనపై సిఎంకు ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన సిఎం చంద్రబాబు త్వరలో 'సోమిరెడ్డి'ని పిలిచి మాట్లాడతానని చెప్పారు. అయితే ఇంతవరకు దానిపై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో మరింత చెలరేగిపోతున్నారట 'సోమిరెడ్డి'. 2003లో 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇవ్వటం తరువాత జరిగిన పరిణామాలు, అనంతరం జరిగిన ఎన్నికల ఫలితాలు 'చంద్రబాబు'కు షాక్‌ తినిపించినప్పటికీ మళ్లీ అదే 'సోమిరెడ్డి'ని చేరదీయటంపై విమర్శలు వస్తున్నాయి. 2004లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో సింగిల్‌సీటుకు కూడా టిడిపికి లభించలేదు. స్వయంగా 'సోమిరెడ్డే' అతి ఘోరంగా ఓడిపోయారు. తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన పరాజయపరంపర కొనసాగుతూనే ఉంది. 2009 మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడిపోతూనే ఉన్నారు. 'జగన్‌'పై ఒంటికాలిపై లేచే 'సోమిరెడ్డి' ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటారు. దీనినే అర్హతగా తీసుకుని చంద్రబాబు ఆయనకు ముందు ఎమ్మెల్సీ తరువాత మంత్రి పదవి ఇచ్చారని నెల్లూరు జిల్లా నాయకులు అంటుటారు. 

   కృష్ణపట్నం రేవులో క్రూడాయిల్‌ మాఫియాకు మంత్రి సోమిరెడ్డి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయిల్‌ సరఫరా చేసే లారీల నుండి ఆయన కమీషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఆయిల్‌ మాఫియాపై కొంత మంది పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలసి వాస్తవాలు వివరించడమే కాకుండా మంత్రి సోమిరెడ్డి ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇంత వరకు బయటకు పొక్కలేదు. అనవసరంగా ఆయనకు మంత్రి పదవి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నానని 'చంద్రబాబు' భావిస్తున్నారట. ఈ ఫిర్యాదులు, ఆరోపణలు తెలుసుకున్న 'సోమిరెడ్డి' 'చంద్రబాబు'ను కలిసేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారట. 'నంద్యాల'లో టిడిపిదే గెలుపు...జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయం...మరో పదేళ్లు చంద్రబాబే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జన్మలో 'జగన్‌' ముఖ్యమంత్రి కాలేడు...అంటూ విమర్శలు చేస్తూ 'బాస్‌' దృష్టిని ఆకర్షించాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. ఒకవైపు ఆయిల్‌మాఫియాకు మద్దతు ఇస్తున్నారు...మరోవైపు పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జిలను చేరదీసి వారికి వ్యతిరేకంగా వేరే వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. సోమిరెడ్డి దూకుడుకు కళ్లెం వేయకుంటే మళ్లీ 2004 పునరావృతం అవుతుందని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నెల్లూరులో ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీకి మంత్రిసోమిరెడ్డి దూకుడు కొంపముంచనుందని 'ఆనం' సోదరులు కూడా అభిప్రాయపడుతున్నారు.

(155)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ