WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ బంద్‌ ప్రశాంతం

వినుకొండ : ఫీజు రియంబర్స్‌మెంట్‌తో పాటు కార్పోరేట్‌ కళాశాలలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అన్నారు. విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బంద్‌ విజయవంతం కాగా విద్యార్ది సంఘాలనాయకులకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సహకరించారు. కొన్ని పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించినప్పటికి మరికొన్ని పాఠశాలలు, కళాశాలలను విద్యార్ది సంఘాల నాయకులు మూసివేయించారు. అనంతరం విద్యార్ది సంఘాలనాయకులు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ పేదవాడి నడ్డివిరుస్తున్నారని, ప్రబుత్వ వసతి గృహాలలో వసతులు సక్రమంగా సమకూర్చలేకపోవటంతో ప్రైవేటు పాఠశాలలో చేరి వేలకు వేలు సమర్పించుకోవాల్సిన పరిస్దితి నెలకొంటుందన్నారు. నిబంధనలు పాటించి నడిపే ప్రైవేటు పాఠశాలలు ఏ ఒక్కటి లేవని వారు దుయ్యబట్టారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు, అధికారులు స్పందించి విద్యా సంస్దల సమస్యలు పరిష్కరించాలని విద్యార్దిసంఘాల నాయకులు కోరారు.

(53)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ