WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పదవులకన్నా పార్టీయే మిన్నగా భావిస్తున్న 'యరపతినేని'...!

ఆయనో సీనియర్‌ రాజకీయనాయకుడు. బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటారు. చేయూతనిస్తారు..ఆర్థిక పరంగా ఆదుకుంటారు..! ప్రత్యర్థులచే హత్యకావించబడిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తారు..వారి కుటుంబసభ్యులను ఉన్నత చదువులు చదివిస్తారు. అంతే కాకుండా ప్రతి ముస్లింకు తమ పుణ్యక్షేత్రమైన మక్కాకు వెళ్లాలనే కోరిక బలంగా ఉంటుంది. అంత దూరం వెళ్లాలంటే కనీసం లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. అంత సొమ్ము పేద ముస్లింలు ఖర్చు పెట్టుకోలేరు. అటువంటి వారిలో పదిమందిని గత సంవత్సరం స్వంత ఖర్చులతో మక్కాకు పంపించారు ఆ ప్రజాప్రతినిధి. ఈసంవత్సరం మరో 20మందిని రూ.20లక్షల రూపాయల ఖర్చుతో మక్కాకు పంపించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారిలో ఆయన అందరికన్నా ముందుంటారు. కాంగ్రెస్‌ నాయకుల చేతిలో హత్య కావించబడిన టిడిపి కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా వారికి ఆర్థిక వనరులను చేకూర్చారు ఆ ఎమ్మెల్యే. ఇదే విషయాన్ని లబ్దిపొందినవారు బాహాటంగా ఇంతకుముందే వెళ్లడించడం జరిగింది. పార్టీ కార్యక్రమాలకు ఎందరో వస్తుంటారు..పోతుంటారు..ఎమ్మెల్యేలను పిలిపించేందుకు స్వంత సొమ్మును ఖర్చు పెడతారు..జెండాను మోస్తారు..అంతే కాకుండా ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాకుండా తమ పార్టీకి చెందిన సానుభూతిపరులు ఇతర పార్టీల వైపు చూడకుండా రాత్రింభవళ్లు కాపాలా కాస్తారు. అటువంటి కార్యకర్తలను చాలా మంది ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. అందుకు భిన్నంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు చురుగా వ్యవహరిస్తున్నారు. వివరాలు తెలుసుకుని తానే స్వయంగా అటువంటి వారి ఇళ్లకు వెళ్లి వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఆయనెవరో కాదు...గురజాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. 

   అనేక సంవత్సరాల నుండి పార్టీ కోసం కష్టపడుతున్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. ఆయన వ్యాపారపరంగా ఎన్నికోట్లు సంపాదించుకుంటున్నారో తమకు అనవసరమని, మా కుటుంబాలను ఆర్థికపరంగా ఆదుకోవడంలో ముందుంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలు గుంటూరులో ఎందరు ఉన్నారు..? 'జగన్‌' పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన విలన్‌. టిడిపి నాయకులకు, కార్యకర్తలకు,ఓటర్లకు ఆయన 'యరపతినేని' హీరో. టిడిపి కార్యకర్తలను వెంటనే స్పందిస్తారు...సంబంధిత అధికారులతో మాట్లాడి అండదండలు అందిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని కలత చెందలేదు..చంద్రబాబు, చినబాబులపై విమర్శలు చేయలేదు. అందుకే ఆ తండ్రీ కొడుకులకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు 'యరపతినేని'. సీనియర్‌ ఎమ్మెల్యేలు, జూనియర్‌ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఆశించారు...! ఆ పదవులు దగ్గకపోవడంతో ఆఫ్‌ దిరికార్డుగా వాడివేడి విమర్శలు చేయటం జరిగింది. 

  మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా నీకు మంత్రి పదవి ఇస్తాను...అని గతంలోనే 'చంద్రబాబు' హామీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణకు రెండు రోజుల ముందు సిఎం ఆయనను స్వయంగా పిలిచి కొన్ని కారణాలతో నీకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నాను...కానీ ఎల్లప్పుడూ నీకు అండదండలుగా నిలుస్తాను...! నీకు ఏమి కావాల్సి వచ్చినా...తనను కలవమని, సమస్య ఉంటే తీరుస్తానని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేసిన 'యరపతినేని' నాకు మంత్రి పదవి కన్నా మీ అభిమానమే మిన్న..మీకు ఎల్లప్పుడూ విధేయుడగా ఉంటానని చెప్పడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సమయంలో 'యరపతినేని'కి 'చినబాబు' ఎదురయ్యారు...'అన్నా...నీకు ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటాను..ముఖ్యమంత్రి ప్రతిష్టను నీవు పెంచావు..! నీకు పదవి రాకపోయినా...ఎటువంటి విమర్శలు ఆరోపణలు చేయలేదు..నువ్వు మాకుటుంబ సభ్యుడువని కితాబు ఇచ్చారు. అటు తండ్రీకొడుకుల అభిమానాన్ని, ఇటు కార్యకర్తల ప్రేమను పొందిన 'యరపతినేని' మళ్లీ ఎమ్మెల్యేగా అపార మెజార్టీతో గెలవడం ఖాయమని గురజాలకు చెందిన కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ