WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ'కి ఎదురే లేదట...! తేల్చిన ఇండియాటుడే సర్వే...!

లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం మళ్లీ బంపర్‌ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేలింది. 'మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' పేరుతో ఇండియాటుడే గ్రూప్‌-కార్వే సంస్థ కలిపి నిర్వహించిన ఈ సర్వేలో ఎన్‌డిఎకు 349 సీట్లు లభిస్తాయని తేలింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 47 సీట్లుకు మించిరావని పేర్కొంది.పెద్దనోట్ల రద్దు, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్టైక్స్‌ వంటి చర్యల వల్ల ప్రధాని మోడీ ప్రతిష్ట ప్రజల్లో పెరిగిందని కూడా ఈ సర్వే తేల్చింది. ప్రధాని మోడీకి ధీటైన ప్రత్యర్థులు లేరని దేశ ప్రజలు అభిప్రాయపడుతున్నారని పేర్కొంది. కాగా నోట్ల రద్దు తమపై తీవ్ర ప్రభావం చూపిందని దాదాపు 60శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు తేలింది.

సర్వేలోని ప్రధానాంశాలు...!

1.ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే 'మోడీ' నేతృత్వంలోని ఎన్‌డిఎకు 349 సీట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. అయితే గత జనవరిలో ఇదే సంస్థ చేసిన సర్వేలో  360 సీట్లు లభిస్తాయని చెప్పగా ఇప్పుడు 11సీట్లు ఎన్‌డిఎ కోల్పోనుందని సర్వేలో తేలింది. కాగా ఎన్‌డిఎ వరుసగా మూడవసారి కూడా 300 ప్లస్‌ సీట్లు పొందగలిగిందని సర్వేలో తేలింది.

2.నరేంద్రమోడీయే తమకు ఫస్ట్‌ఛాయిస్‌ అని దేశ ప్రజల్లో ఎక్కువ మంది చెప్పారు. ఇండియాటుడే నిర్వహించిన ఈ సర్వేలో ఆయనను అందుకునే ప్రత్యర్థి మరోసారి కూడా ఎదురు కాలేదట. కాగా 2014 సర్వే సమయంలో బెస్ట్‌పిఎంగా 12శాతం పాయింట్లతో స్వర్గీయ ఇందిరాగాంధీ 'మోడీ'ని అధిగమించగా ఇప్పుడు 16శాతం పాయింట్లతో 'మోడీ' 'ఇందిరాగాంధీ'ని అధిగమించారు.

3.ప్రధాని మోడీ పాపులారిటీ దక్షిణభారతదేశంలో క్షీణిస్తోందని సర్వే అభిప్రాయపడింది. భారతీయ జనతాపార్టీ తనశక్తియుక్తులన్నీంటిని ఇక్కడ కేంద్రీకరించినా 'మోడీ' ప్రభావం  ప్రజలపై పనిచేయడం లేదట. అదే సమయంలో మైనార్టీలో (ముస్లిం మరియు క్రిస్టియన్స్‌)లో స్వర్గీయ ఇందిరాగాంధీయే ఇప్పటికీ బెస్ట్‌పిఎం అని తేలింది.

4.ప్రధాని మోడీ గ్రామీణ భారతంలోనూ...పట్టణ ప్రాంతంలోనూ బాగా పేరు తెచ్చుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ పనితీరుపై 63శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. అయితే గత జనవరి సర్వేను దీనితో పోలిస్తే ఆయన పనితీరు 6శాతం తగ్గిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారట.

5.పెద్దనోట్ల రద్దు అయిన తొమ్మిది మాసాల తరువాత కూడా తాము ఈ చర్య వల్ల నష్టపోయామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 60శాతం మందికి పైగా ప్రజలు భావిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజల నుండి చిన్నస్థాయి వర్తకులు, రైతులు, మరియు నిరుద్యోగులను నష్టపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

6.బ్లాక్‌మనీని అరికట్టడంలో 'మోడీ' ప్రభుత్వం విజయం సాధించిందని, ఇది 'మోడీ' సాధించిన అతి పెద్ద విజయమని ఓటర్లు పేర్కొన్నారు. బ్లాక్‌మనీ తరువాత అవినీతి రహిత ప్రభుత్వంగా 'మోడీ' పేరు తెచ్చుకున్నారని 23శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు. 'మోడీ' సాధించిన అతి పెద్ద విజయంగా నోట్ల రద్దు అని దక్షిణాది ఓటర్లు భావిస్తున్నారట.

7.కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రభ రోజు రోజుకు కొడి గట్టిపోతుందని ఎక్కువ మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్‌ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీ అయితే బాగుంటుందని 25శాతం మంది ఓటర్లు భావిస్తున్నారట. అయితే గత జనవరిలో ఈ శాతం 30గా ఉండేది.

8.కాంగ్రెస్‌ పార్టీని ఎవరు మళ్లీ అధికారంలోకి తీసుకురాగలరనే ప్రశ్నకు దాదాపు 43శాతం మంది 'గాంధీ' ఫ్యామిలీతోనే అది సాధ్యమవుతుందని చెప్పారు.

9.పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' బెస్ట్‌సిఎంగా ప్రజలు భావిస్తున్నారు. రెండవ స్థానంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఉన్నారని సర్వే తెలిపింది.

10.బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌ పాపులర్‌ నటుడని 20శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఆయన 'సల్మాన్‌ఖాన్‌'ను అధిగమించారు. ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ 'విరాట్‌ కోహ్లీ' నెంబర్‌వన్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌గా సర్వేలో తేలింది. ఆయనకు దాదాపు 23శాతం ఓటర్లు మద్దతు ఇచ్చారు. క్రికెటేతర ఆటల్లో 'పివి సింధు' మొదటి స్థానం సాధించగా, సానియా మీర్జా, సైనా నెహవాల్‌ టాప్‌-5లో చోటు సాధించారు.


(410)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ