WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఘనంగా ఎమ్మెల్యే జీ.వి.ఆంజనేయులు కుమారుడు హరీష్‌ వివాహ రిసెప్షన్‌ వేడుకలు...

వినుకొండ : జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు కుమారుడు హరీష్‌ వివాహ రిసెప్షన్‌ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. హరీష్‌, దేవి మౌనికల రిసెప్షన్‌ వేడుకలను నరసరావుపేట రోడ్డులోని లయోలా ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్‌ల మధ్య వధూవరులను ఆశీర్వదించేందుకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 90 వేల నుండి లక్ష మంది వరకు ప్రజలు హజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌లో వినుకొండ పట్టణానికి చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయిలో రిసెప్షన్‌ వద్దకు చేరుకున్నారు. నూతన వదూవరులను ప్రత్యేక బుకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జీ.వి తల్లిదండ్రులను పలకరించి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు మంత్రి పత్తిపాటి పుల్లారావు, నన్నపనేని రాజకుమారి, ఎం.ఎల్‌.సిలు, జిల్లా రూరల్‌ ఎస్‌పి అప్పలనాయుడు, మండల స్దాయి అధికారులు అందరూ వివాహ వేడుకలకు హజరయ్యారు. అనంతరం సినీ గాయకులు గీతా మాధురి, శివారెడ్డిలతో ఏర్పాటు చేసిన పాటకచేరి అందరిని అలరించింది. 




(173)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ