కాలుష్య నివారణ కోసం మట్టివినాయకుల ప్రతిమలను పంపిణీ చేయటంలో సామాజికసేవా సంస్థలు, రాజకీయపార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల టిడిపి ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ 'సతీష్ ప్రభాకర్' ముందున్నారు. సుమారు 10వేల మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఆయన దగ్గర ఉండి పంపిణీ చేశారు. అంతే కాకుండా మండల హెడ్ క్వార్టర్స్‌లో కూడా స్థానిక టిడిపి నాయకులతో ఆయన మట్టిప్రతిమలను పంపిణీ చేయించారు. పొన్నూరు ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర కూడా కొంత వరకు పంపిణీ చేశారు. అయితే ఆయన అనుకున్న విధంగా అది సక్సెస్ కాలేదు. మట్టి వినాయకప్రతిమలను పంపిణీ చేసే కార్యక్రమంలో విపక్షాలనాయకులెవరూ ముందుకు రాకపోవడం విశేషం. మట్టివినాయకుల ప్రతిమలతో పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గంలో టిడిపి నాయకులు ముందంజలో ఉన్నారు. స్వచ్చంధ సేవా ప్రతినిధులు కూడా పరస్పరం పోటీపడి మట్టివినాయక విగ్రహాలను పంపిణీ చేయటంలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలీకృతులయ్యారు. వినాయకచవతి సందర్భంగా అన్ని జిల్లాల్లో మట్టివినాయక ప్రతిమలను పంపిణీ చేయటంలో స్వచ్చంధ సంస్థలు ముందంజలో ఉండేవి. తాజాగా రాజకీయపార్టీలు ముందంజలో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దృష్టిపెట్టారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల బిజీలో ఆయన ఈ కార్యక్రమంపై బాగా దృష్టిపెట్టలేదు. బాపట్ల నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఎమ్మెల్సీ సూచనలతో అధికారపార్టీనాయకులు మట్టివినాయకప్రతిమలను భారీ ఎత్తున పంపిణీ చేశారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ