లేటెస్ట్

ఒక్కో ఐఏఎస్‌కు అన్నేసి పోస్టులా?

అటు ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక ఐఏఎస్‌ అధికారి కొన్ని శాఖలకే నియమితులు కాగా, తాజాగా జగన్‌ ప్రభుత్వంలో ఒక్కో ఐఏఎస్‌ అధికారులు ఎన్నో పోస్టులు నిర్వహించడంపై సిఎస్‌ను కలసి అభ్యంతరం వ్యక్తం చేయగా, తాను ఏమీ చేయలేనని, తాను కేవలం నామ మాత్రంగానే ఉన్నానని, ఈ విషయాన్ని తన ముందు ప్రస్తావించవద్దని ఆ ఐఏఎస్‌ అధికారులకు సూచించినట్లు తెలిసింది. తాము ఎంతో నిజాయితీగా సమర్థవంతంగా గతంలో బాధ్యతలు నిర్వహించామని, తాజా కూడా నిర్వహిస్తున్నామని, తమను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించడం ఏమిటని కొందరు అధికారులు సిఎస్‌ సమీర్‌శర్మను నిలదీసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయన మాత్రం ఏమి చేయగలరు..? ఐఏఎస్‌ అధికారులు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించే సాంప్రదాయం గతంలో ఉండేది..తాజాగా పాలకులు అటువంటి సాంప్రదాయం  పాటించకపోతే ‘సమీర్‌శర్మ’ మాత్రం ఏమి చేయగలరు...? ఆయనతో మొరపెట్టుకుంటే ఒరిగేదేముందని కొందరు అధికారులు అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కొందరు ఐఏఎస్‌ అధికారులు అనేకశాఖాధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న రజిత్‌భార్గవ ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లశాఖలతో పాటు, యువజన, క్రీడలు, పర్యాటకశాఖాధిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా మహిళా ఐఏఎస్‌ అధికారి పూనం మాలకొండయ్య వ్యవసాయశాఖ, పశుసంవర్ధకశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిఎం కార్యాలయంలో పనిచేస్తోన్న ముత్యాలరాజు జిఎడి పొలిటికల్‌ను కూడా చూస్తున్నారు. (ఈ సంప్రదాయం ప్రవీణ్‌ ప్రకాశ్‌తో ప్రారంభమైన విషయం విదితమే) అత్యంత ప్రాధాన్యత కల సిసిఎల్‌ కమీషనర్‌ పోస్టుతో పాటు రెవిన్యూశాఖాధిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ‘సాయిప్రసాద్‌’. ఇటీవలే ‘సాయిప్రసాద్‌’ను ఆ పోస్టుల్లో నియమించింది. జిఎడీ సర్వీసుల శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ‘శశిభూషన్‌కుమార్‌’ను ఇటీవలే ‘ఇరిగేషన్‌శాఖాధిపతిగా నియమించినా.మళ్లీ ఆయనకే సర్వీసుశాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ విధంగా సచివాలయంతోపాటు, హెచ్‌ఓడిల్లో కూడా ఒక్కొక్కరిని రెండుమూడు పోస్టుల్లో నియమించడం జరిగింది. తనకు ఇష్టమైన వారిని ప్రభుత్వం ఆ విధంగా నియమిస్తుందా..? ఆ విధంగా నియమించేటట్లు జగన్‌ను ఎవరైనా తప్పుదోవపట్టిస్తున్నారా..? ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోరు. ముఖ్యమంత్రిని కలిసి స్వయంగా చెబుదామంటే ధైర్యం చాలడం లేదు. ఒక వేళ ధైర్యం తెచ్చుకుని జగన్‌ను కలవాలని ప్రయత్నించినా ఆయన సమయం ఇవ్వడం లేదట. ఏది ఏమైనా కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చి ఒక్కో ఐఏఎస్‌ అధికారిని రెండు మూడు పోస్టుల్లో నియమించడం బాధను కల్గిస్తుందంటున్నారు అధికారులు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ