WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మేకపాటి' ఎక్కడున్నారో:ఆదాల

ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎక్కడ ఉన్నారో కానీ...ప్రజలను పూర్తిగా మరిచిపోయారు...ఓడిపోయిన తాను..ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కానీ..వారి అవసరాలను గుర్తించడంలో కానీ ముందున్నానని మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అంటున్నారు. ఎంపి రాజమోహన్‌రెడ్డికి అనేక చరకలు అంటించారు. తాను ఓడిపోయి మూడు సంవత్సరాలు అయినప్పటికీ నిరాశ,నిస్పృహ చెందకుండా,అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ప్రజల్లో ఉంటున్నానని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీనీ నెరవేర్చాననన్నారు. దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం 'చంద్రన్నభీమా' పథకమేనని, ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఈ పథకం అమలు కావడం లేదని 'ఆదాల' చెప్పారు. ఎన్టీఆర్‌ గృహాలు, రాజకీయాలకు అతీతంగా మంజూరు చేస్తున్నామని అదే విధంగా ఫించన్లు కూడా ఇస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో తమ ప్రభుత్వం ముందుందని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో ప్రసంగిస్తూ చెప్పారు. పార్టీ జెండాలను ఆవిష్కరించడమే కాకుండా ఇంటింటా కరపత్రాలను అందజేశారు. వ్యాపారంలో రాబట్టుకున్న సొమ్ములను రాజకీయంగా పోగొట్టుకున్నానే తప్ప..ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ పరకుండా, అక్రమాలకు పాల్పడకుండా పేరు తెచ్చుకున్నవారిలో ఆయన చాలా మందికన్నా ముందున్నారని ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇతర ముఖ్యులు వ్యాఖ్యానించారు. నెల్లూరు ఎంపిగా విజయం సాధించిన 'రాజమోహన్‌రెడ్డి' ఎక్కడ ఉన్నారో...? ఏం చేస్తున్నారో...? ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఇతర సమస్యలపై దృష్టిసారించారేమోనన్న అనుమానాన్ని ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇతర నాయకులు విమర్శించారు.

(252)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ