WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ధనిక రాష్ట్రంలో ఇంతమంది పేదలున్నారా..!?

ఒక్కోసారి సర్వేలు రాజకీయ నాయకుల అబద్దాలకు పాతర వేస్తుంటాయి...! నేను చెప్పేది...ఎన్నికలు...ఓట్ల సర్వే కాదు...! ఆ మధ్య తెలంగాణ మొత్తం బంద్‌పెట్టి, కర్ఫ్యూ వాతావరణంలో  తెలంగాణ ప్రభుత్వం చేయించిన సమగ్ర సర్వే గురించి...! ఆ రోజు సర్వేకు హాజరు కాకపోతే..తెలంగాణ పౌరులు కాదన్నట్లుగా వ్యవహరించి చేసిన సర్వేలో తేలిన విషయమేమిటంటే...తెలంగాణ జనాభా మొత్తం దాదాపు 3 కోట్ల 60 లక్షలకు పైగా...! మరి నిన్న 'బతుకమ్మపండగ' సందర్భంగా మహిళలకు పంచిన చీరలు ఎన్నో తెలుసా...? సుమారు కోటి ఆరు వేలు...! అంటే తెలంగాణ జనాభాలో ఒక వంతు భాగం..! వీరందరూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే. ఒక కుటుంబంలో ఒక మహిళ ఉంటే మరో పురుషుడు ఇంటికో చిన్నారిని లెక్కేసుకున్నా...మొత్తం మూడు కోట్ల మంది. అంటే ప్రభుత్వ సర్వే ప్రకారం వీరంతా పేదలే... ఉన్న జనాభాలో దాదాపు 87శాతం మంది ప్రజలు అతి పేదరికం అనుభవిస్తున్నవారే...! ఉన్న జనాభాలో 87శాతం మంది పేదలు ఉంటే ఆ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందా...? 

  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడితే తమది ధనిక రాష్ట్రమని...తామేం చేసినా ఫర్వాలేదనట్లు మాట్లాడుతుంటారు. ప్రజల కోసం వివిధ సంక్షేమపథకాల అమలుకు నిధులెక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించిన ప్రతి సందర్భంలో ఆయన ఇదే పాట పాడతారు. గుజరాత్‌ తరువాత తామే సంపన్నులమని చెబుతుంటారు...! నిన్నటి దాకా ప్రపంచం మొత్తం ఇదే నిజమని నమ్మింది..కానీ 'చీరలు' కెసిఆర్‌ గాలి తీసేసింది. లేదా...చీరల సొమ్ముల కోసం పేదల సంఖ్యను పెంచారా..? నిజంగా ఇంత మంది పేదలు లేరా..? చీరల కాంట్రాక్టులు పొందిన ముఖ్యులే లేని పేదలను సృష్టించారా...? పేదల పేరుతో చీరల సొమ్ములు దిగమింగేందుకు...కెసిఆర్‌ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారా..? ఏమో...మనకేం తెలుసు...అంతా ఏలిన వారి దయ. కాగా..చీరల పంపిణీ తరువాత...ధనిక రాష్ట్రంలో ఇంత మంది పేదలున్నారా..? అని దేశ మొత్తం ఆశ్చర్యపోతోంది...! మరి కెసిఆర్‌ ఏం సమాధానం చెబుతారో..వేచి చూడాలి...!


(411)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ