WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మోడీజీ...వాస్త‌వాలు ఇప్పుడు తెలుస్తున్నాయా...?

సోమవారం ఢిల్లీలో నిర్వహించిన భారతీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం ముగిసింది. ఇందులో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపారు. దేశ ఆర్థిక పురోగతి నెమ్మదించిందన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఆర్థిక సలహాదారుల మండలిని ఏర్పాటు చేశారు.ఆర్థిక వ్య‌వ‌హారాలతో పాటు ప‌లు అంశాల‌పై ప్రధానికి స‌ల‌హాలు ఇవ్వ‌డానికి స‌లహా మండ‌లిని నియ‌మించారు. నీతి అయోగ్ స‌భ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ స‌ల‌హా మండ‌లి ప‌నిచేస్తుంది. ఈ మండలిలో సుర్జీత్‌ భల్లా, రథిన్‌ రాయ్‌, ఆషిమా గోయల్‌, రతన్ వతల్‌ సభ్యులుగా ఉండనున్నారు.నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందనే అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

  ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టినా.. దేశ ఆర్థికావృద్ధి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఆర్థిక పురోగతి నెమ్మదించిందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ సలహాదారుల మండలిని ఏర్పాటుచేశారు. దేశంలోని కీలక అంశాలపై కూడా ప్రధానికి స‌ల‌హా సంఘం సూచ‌న‌లు ఇస్తుంది. స‌మ‌యానుకూలంగా నివేదిక‌లు కూడా ఇస్తుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత ప్రధాని మోదీ దీన్ దయాల్ ఉర్జా భవన్ ను ప్రారంభించారు. అలాగే ప్రధాన మంత్రి సహజ్ బిజ్లి యోజననుప్రారంభించారు.కాగా, ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ,400ఎమ్మెల్యేలు,280మందిఎంపీలు 2,500 బీజేపీ నేతలు పాల్గొన్నారు.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ