WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం దసరా కానుక

తెలంగాణ జర్నలిస్టుందరికీ సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. జర్నలిస్టులందరికీ సీఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. రాబోయే 25రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ఉద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచుతామని ప్రకటించారు. దసరా పండుగ తర్వాత అల్లం నారాయణతో సమావేశం ఏర్పాటు చేసి ఇండ్ల స్థలాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 2లేదా 3 ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల పరిశీలన జరిగిందని సీఎం తెలిపారు. వీలైతే ఒకే చోట ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒకే చెప్పేసిందనివెల్లడించారు సీఎం.

(300)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ