WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతి అధికారిని సస్పెండ్‌ చేస్తారా...? పోస్టింగ్‌ ఇస్తారా...?

ఎక్సైజ్‌శాఖలో అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉండడంతో కొందరు అధికారులను సస్పెండ్‌ చేయమని ఆ శాఖ కమీషనర్‌ సిఫార్సు చేయగా ఒక అధికారి సస్పెండ్‌కు మాత్రమే అంగీకరించిన మంత్రి మరొక అధికారి ఫైల్‌ను ఇప్పటికీ తన దగ్గర పెట్టుకోవడంపై ఆ శాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ కమీషనర్‌ 'నాగలక్ష్మి' సస్పెండ్‌ అయినా చేయండి...లేదా ఏసీబీతో విచారణ అయినా చేయించండి..అని కమీషనర్‌ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఆశాఖ మంత్రి జవహర్‌ ఇంత వరకు తన నిర్ణయం తెలపడం లేదు. ఇటీవల 'నాగలక్ష్మి' డిప్యూటీ కమీషనర్‌ పోస్టులో తిరిగి చేరేంధుకు ప్రయత్నించగా ఆ జిల్లాకు చెందిన ఇతర అధికారులు, ఉద్యోగులు ఆమె కింద పనిచేయలేమని, ఒకవేళ ఆమె కనుక తిరిగి ఉద్యోగంలోకి వస్తే తామంతా మూకమ్మడి సెలవులో వెళతామని హెచ్చరించారు. ఆమెను తిరిగి అదే ప్రదేశంలో ఉద్యోగంలోకి తీసుకోవద్దని, ప్రభుత్వానికి రిపోర్టు చేయమని కమీషనర్‌ సూచించారు. దీంతో 'నాగలక్ష్మి' తనకు పోస్టు ఇవ్వమని ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకున్నారు. సంబంధిత ఫైల్‌ ఇంకా మంత్రి కార్యాలయానికి చేరిందో లేదో తెలియదు. గతంలో ఆమె సస్పెండ్‌ చేయాలని సూచించిన ఫైల్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉండగా ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వాలనే ఫైల్‌ కూడా మంత్రి వద్దకు రాబోతోంది. ఈ విషయం సిఎంఒ అధికారుల దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా ఈ వ్యవహారం వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికైనా మంత్రి జవహర్‌ 'నాగలక్ష్మి' వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారో..? కమీషనర్‌ సిఫార్సు చేశారు..ఆశాఖాధిపతి కూడా అందుకు అనుకూలంగా రాసి మంత్రికి ఫైల్‌ పంపారు. ఆ శాఖాధిపతి సాంబశివరావు, కమీషనర్‌ 'లక్ష్మీనర్సింహ్మం'లకు నిజాయితీపరులైన అధికారులుగా పేరుంది. మంత్రి ఎటువంటి నిర్ణయం ఇంత వరకు తీసుకోకపోవడంతో అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ