WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా'కు తరలివచ్చిన 'ప్రెస్‌ అకాడమీ'...!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం విజయవాడకు 'ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రెస్‌ అకాడమీ' తరలివచ్చింది.విజయవాడ నగరంలోని మొఘల్రాజపురంలో ప్రెస్‌ అకాడమీని మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార,గృహనిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమీ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.   రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌లో ఉన్న పలు సంస్థలు ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాలకు తరలివచ్చాయి. గత కొన్నాళ్లుగా ప్రెస్‌ అకాడమీని కూడా తరలించాలని ఛైర్మన్‌ వాసుదేవ దీక్షితులు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకోని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు మంగళవారం నాడు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ వాసుదేవదీక్షితులు, సమాచారశాఖ కమీషనర్‌ వెంకటేశ్వరన్‌, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.


(154)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ