WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ధీర్ఘకాలిక సెలవుపై గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌...!

ఆమె మహిళా జూనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి. ఓర్పు తక్కువ...కోపమెక్కువ...! అంతే కాకుండా పరిపాలనానుభవం కూడా అంతంత మాత్రమే. జిల్లా కలెక్టర్‌ ఆమెకు కనీసం మర్యాద కూడా ఇవ్వరని ప్రచారంలో ఉంది. ఇదే విషయంపై ఆమె పలువురితో మాట్లాడుతూ అటువంటిదేమీ లేదు...తనకు సముచితమైన గౌరవం కలెక్టర్‌గారు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయంపై కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తోన్న పలువురు ఉద్యోగులను కలసి ప్రశ్నించగా...మా జాయింట్‌ కలెక్టర్‌ను కలెక్టర్‌ ఖాతరు చేయని మాట వాస్తవమే. కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఆయన మీద కోసం ఆమె ఇతర ఉద్యోగులపై చూపిస్తున్నారు. ఇదెక్కడో కాదు..రాష్ట్రరాజధాని అయిన గుంటూరు జిల్లాలో జరుగుతోంది. జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్‌ ఐఎఎస్‌ అధికారికి రాజధాని ప్రాంత సమస్యలను పరిష్కరించాలని బాధ్యతలు అప్పచెపితే అనుభవం లేని ఆమె ఎలా పరిష్కరిస్తారు. 

  గతంలో ఇదే పోస్టును నిర్వహించి బదిలీ అయిన ప్రస్తుతం సిఆర్‌డిఎ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెరుకూరి శ్రీధర్‌' అద్బుతంగా పనిచేశారు..రైతులతో కలసిపోయి భూసేకరణ విషయంలో రాత్రింభవళ్లు కష్టపడ్డారు. 'శ్రీధర్‌'కు ఉన్న అధికార అనుభవం ఆయనకు ఎంతో కలసి వచ్చింది. అటువంటి అధికారి పనిచేసిన పోస్టులో ఆయనంత అనుభవం లేకపోయినా..కొంచెం అనుభవం ఉన్న అధికారిని నియమించాల్సిన పాలకులు ఓర్పు,నేర్పు, తెలుగుభాషలో పరిజ్ఞానం లేని తెలుగేతర మహిళా అధికారిని నియమిస్తే ఆమె ఏమి చేయగలుగుతారు. గుంటూరు జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా అనుభవం కల ఐఎఎస్‌లు నియమించాల్సిన ప్రభుత్వం జూనియర్‌ అధికారిని ఆ పోస్టులో నియమించి చేతులు కాల్చుకుంటున్నారు. ఆ జాయింట్‌ కలెక్టర్‌కు ఎటువంటి అనుభవం ఎదురైనాయో కానీ...వ్యక్తిగత కారణాలతో ఆమె ధీర్ఘకాలిక సెలవుపెట్టాలని భావిస్తున్నట్లు బయటకు పొక్కింది. అధికార అనుభవం ఎక్కువగా లేకపోవడంతో జాయింట్‌ కలెక్టర్‌ సేవలను కలెక్టర్‌ వినియోగించడం లేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. రైతులు ఆమెను కలిసేందుకు వస్తే వెంటనే కలవరు...ఒకవేళ కలిసినా ఓర్పుగా వారు చెప్పింది వినరు..నేర్పుగా వారికి సర్దిచెప్పలేరు.దానికి తగ్గట్లు తెలుగుభాష రాకపోవడం...ఇవన్నీ లేని మహిళా జూనియర్‌ ఐఎఎస్‌ అధికారిని రాజధాని ప్రాంతంలో ఎలా నియమించారు. తాను సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తున్నా...జాయింట్‌ కలెక్టర్‌ మాత్రం తనను అందుకోవడం లేదనేది కలెక్టర్‌ అభిప్రాయం. ఏ కారణాలతో ఆమె సెలవుపై వెళ్లబోతున్నారనే విషయం బయటకుపడపోయినా..ఆమె ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం ఖాయమని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.




(487)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ