WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒక అధికారికి ఇన్ని శాఖాధిపతి పోస్టులా...!?

ఆయన ఐఎఎస్‌ అధికారి. గతంలో కలెక్టర్‌గా ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఎంత సమర్థంగా పనిచేశారో ఏ ఒక్కరికీ తెలియదు. కానీ కృష్ణా పుష్కరాలకు ప్రత్యేకాధికారిగా ఆయనను నియమించాక ఆయన అదృష్టం రాకెట్‌ వేగంతో దూసుకుపోయింది. కృష్ణా పురష్కరాలు ముగిశాక ఆయనను పౌరసరపరాల కమీషనర్‌గా, ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ఆ అధికారి పేరు రాజశేఖర్‌. ఆ తరువాత వ్యవసాయ,మార్కెటింగ్‌ మరియు సహకారశాఖాధిపతిగా అదనపు బాధ్యతలు అప్పచెప్పి సంవత్సరంపైగా గడిచింది. ఎంతో మంది సీనియర్‌ అధికారులు చిన్న చిన్నశాఖాధిపతులుగా పనిచేస్తుండగా, వారందరికన్నా జూనియర్‌ అయిన 'రాజశేఖర్‌' నాలుగుశాఖలకు అథిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన మంత్రులైన 'సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి', ఆదినారాయణరెడ్డిని, పత్తిపాటి పుల్లారావును ఎక్కువగా పట్టించుకోరన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ముఖ్యమైన శాఖలకు ఒకే అధికారిని నియమించాల్సిన పాలకులు తమకు ఇష్టమైన వారికి మూడు నుండి నాలుగు శాఖలను కట్టబెడుతున్నారు. పౌరసరఫరాలసంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారం కమీషనర్‌ రాజశేఖర్‌కు తెలుసా...? తెలియదా..? ఒకవేళ తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా...? నాకెందుకులే ఇదంతా అని వెనక్కు తగ్గారా...? సిఎంఒ అధికారి ఆశీస్సులు ఆ సంస్థ ఎండి 'రాజగోపాల్‌'కు ఉండడంతో అనవసర రిస్క్‌ తీసుకోవడం ఎందుకని భావిస్తున్నారా...? ఒకవైపు మంత్రులను పట్టించుకోరు...మరో వైపు అవినీతిని ఆపలేరు. అటువంటి అధికారికి నాలుగుశాఖలను ముఖ్యమంత్రి అప్పచెప్పడం ఎంత వరకు సబబు అని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

(166)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ