WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆయనకు ఎపి భవన్‌ అయినా...ఒకటే....టీటీడీ అయినా ఒకటేనటా...!?

ఆయన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ హోదాలో పనిచేశారో రాజకీయ,అధికార వర్గాలకు కూడా తెలియదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ఆ అధికారిని కేటాయించారు. అప్పటి వరకు ఢిల్లీలోనే అధికారిగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటువంటి అధికారిని టీటీడీ ఇఒగా పాలకులు నియమించారు. ఆ నియామకానికి ముందు ఢిల్లీలో ఎపిభవన్‌ రెసిడెంట్‌కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. టీటీడీ ఇఓగా నియమితులయ్యాక ఆయన పనితీరు ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. టీటీడీ సంస్థను ఢిల్లీలోని ఎపిభవన్‌గా ఆయన భావిస్తున్నారట. ఎపి భవన్‌కు వివిధ సిఫార్సులకు వచ్చిన లేఖలను వివిధ అధికారులకు ఎలా పంపుతారో..అదే విధంగా టీటీడీలో అధికారాలన్నింటిని తిరుమల జెఇఓకు, తిరుపతి జేఇఓకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఇఒగా నిర్వహించాల్సిన కనీస బాధ్యతలను కూడా ఆయన నిర్వహించడం లేదు. 

  ప్రముఖులు తిరుమలకు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తుంటారు. సాంప్రదాయాలు ఆయనకు తెలుసో...తెలియదో..? ఎవరెవరైతే వివాదాల్లో, అవినీతి ఆరోపణలో కూరుకుపోయారో..వారినే ఆయన చేరదీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జరుగుతున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోరు. ఇంత దారుణమైన పరిస్థితి తమ ముప్పయి సంవత్సరాల్లో చూడలేదని క్రిందిస్థాయి అధికారులు చెబుతున్నారు...! ఆయన తెలుగు మాట్లాడడం అంతంతమాత్రమే...! సమస్యలను వినిపించుకోరు..ఒక వేళ విన్నా పట్టించుకోరు..ఉద్యోగులు తమ సమస్యలపై ఇఓను కలిస్తే తిరుమల జెఇఒను కలవండి...లేకపోతే తిరుపతి జెఇఒను కలవండి అని సలహాదారు. ఆయన పేరు అశోక్‌కుమార్‌సింఘాల్‌. కనీసం కలెక్టర్‌గా కానీ, డైరెక్టర్‌గా కానీ బాధ్యతలు నిర్వహించని సింఘాల్‌ను ఏకంగా టీటీడీ ఇఒగా నియమించారు పాలకులు. అంతకు ముందు ఆయన ఢిల్లీలో ఎపి రెసిడెంట్‌కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. సింఘాల్‌ బంధుమిత్రులు,రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులట. ఈ అధికారిని టీటీడీ ఇఒగా నియమించాలని కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి కూడా సిఫార్సు చేశారట. టీటీడీ వంటి పవిత్రమైన దేవస్థానంలో సాంప్రదాయాలు తెలియని, పాటించని అధికారిని ఏ విధంగా ఇఓగా పాలకులు నియమించారు..? అవినీతికి, అక్రమాలకు పాల్పడకపోయినప్పటికీ పరిపాలనాదక్షుడిగా సత్తాచూపడంలో 'సింఘాల్‌' విఫలమయ్యారు...! ఆయనకు ముందు ఇఒగా బాధ్యతలు నిర్వహించిన 'సాంబశివరావు' ఏ విధంగా బాధ్యతలు నిర్వహించారు..ప్రస్తుతం సింఘాల్‌ ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారో పరిశీలిస్తే అధికారాలు,బాధ్యతలు, ఇతర అధికారులపై మోపి తాను మాత్రం ఏసి గదికే పరిమితమవుతున్నారనే విమర్శలు కొనితెచ్చుకుంటున్నారు సింఘాల్‌...!

(393)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ