WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణాజిల్లాలో నూతన సాప్ట్‌వేర్‌తో...'మీకోసం'...!

ఆయన సమర్థుడైన ఐఎఎస్‌ అధికారి. ఏదో ఒక కొత్త కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఉభలాటపడుతుంటారు. రోజుకు కనీసం పదిహేను గంటలు కష్టపడతారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం జరిగితే ఆ అధికారి సహించరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తారు...ఆగమేఘాలపై కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఇన్నేళ్ల ప్రభుత్వ సర్వీసులో రాజకీయ, అధికార మన్నలను పొందారు..ఇప్పటికీ పొందుతూనే ఉన్నారు. ఆ అధికారి ఎవరో కాదు...రాజకీయచైతన్యం కలిగిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం. ఇప్పటికే కృష్ణా జిల్లాల్లో అనేక కార్యక్రమాలను అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు పొందారు. అంతే కాకుండా అవార్డులను కూడా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి స్థానంలో 'మీకోసం' కార్యక్రమాన్ని కొత్త సాప్ట్‌వేర్‌తో ప్రవేశపెట్టింది. మొట్టమొదట సారిగా కృష్ణా,గుంటూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. సోమవారం నాడు కలెక్టర్‌ లక్ష్మీకాంతం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇంతకు ముందు జరిగిన సమీక్షా సమావేశంలో ఈ కార్యక్రమంపై అధికారులతో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారులు మాత్రమే ఈ వర్క్‌షాప్‌కు హాజరవ్వాలని ఆదేశించారు. ఎవరైనా అధికారులు ఈ వర్క్‌షాప్‌కు రాకుండా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హెచ్చరించడం జరిగింది. 

  'మీ కోసం' కార్యక్రమంపై డివిజన్‌లో మండలస్థాయి అధికారులకు వీడియో సమావేశాల ద్వారా శిక్షణ ఇస్తామని ఆయన తెలియజేశారు. కలెక్టరేట్‌లో 'మీ కోసం' కార్యక్రమానికి వచ్చే ప్రజలు తమ దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు నెంబర్‌ కూడా తప్పకుండా రాయాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం సూచించడం జరిగింది. ఏ సమస్యలపై వచ్చినా ఆయా సమస్యలపై వచ్చిన వారి ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని, అప్పుడే ఫలితాలపై ఒక అవగాహన వస్తుందని ఆయన అంటున్నారు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ భూములు, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి...నూతన రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం సెక్షన్‌ 22(ఎ) ప్రకారం ఇక నుంచి రిజిస్ట్రేషన్‌లు జరగవని, కొత్త రిజిస్ట్రేషన్‌ చట్టంపై రెవిన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ చట్టంలోని 22(ఎ) ప్రకారం అసైన్డ్‌భూములు కలెక్టర్‌ సంతంకంతోనే ప్రచురించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్‌ 22(ఎ),ఎ1(బి)లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తుల వివరాలు సేకరించి కలెక్టర్‌ అనుమతి తీసుకుని ప్రచురించడం జరగాలని అధికారులకు 'లక్ష్మీకాంతం' సూచించారు. ఆ తరువాత ఆ భూములు, ఆస్తుల వివరాలను రెవిన్యూశాఖాధిపతికి పంపుతామని, కొద్దిరోజుల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.


(586)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ