WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కలెక్టర్‌' 'లక్ష్మీకాంతం' పనితీరుపై 'మండలి' ప్రశంసల వర్షం...!

ఆయనకు ప్రజల కష్టసుఖాలు తెలుసు. మారు మూల గ్రామాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేయటం తెలుసు. ఆరు నెలలు కాలంలో ఎన్నో మార్పులు, చేర్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు తీసుకెళ్లడం ద్వారా సమర్థుడైన అధికారిగా పేరు పెందారు. జిల్లాలో అభివృద్ధి,సంక్షేమపథకాలు చాలా వేగవంతంగా అమలు జరుగుతున్నాయంటే ఆ అధికారి కృషి ఎంతో ఉంది. జిల్లాను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా, ఇ-పాస్‌  విధానంలో అగ్రభాగంలో, ఆర్థికంగా ముందస్తు ఉండే విధంగా ఆ అధికారి చేసిన కృషిని పలువురు రాజకీయ, అధికారవర్గాలు ప్రశంసల వర్షం కురిపించాయి. ఆ విధమైన ప్రశంసలు కురిపించిన సంఘటన ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సమక్షంలో జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా 'లక్ష్మీకాంతం'ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడాన్ని మొదట్లో తాము తేలిగ్గా తీసుకున్నామని, ఆ తరువాత ఆయన ప్రభుత్వ సంక్షేమపథకాలు అమలులో చూపించిన శ్రద్ద, ఇతర అభివృద్ధి పథకాల్లో ఆయన వేగాన్ని డిప్యూటీ స్పీకర్‌ కొనియాడారు. ఇంతకు ముందు ఎంతో మంది కృష్ణా జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు..పోయారు..వారిలో కొందరిని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. కానీ అందులో అందరూ గుర్తుపెట్టుకునే అధికారిగా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఉన్నారని డిప్యూటీ స్పీకర్‌ చెబుతున్నారు. తుర్లపాటి కుటుంబరావు వంటి మేధావి కూడా కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు కితాబు ఇఛ్చారు. బ్రిటీష్‌ ప్రభుత్వం హయాంలో కలెక్టర్‌గా యూరోపియన్‌కు చెందిన అధికారి పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ...ఆయన తరువాత వచ్చిన చాలా మంది కలెక్టర్లు ప్రజలకు వద్దకు వెళ్లకుండా కార్యాలయాలకే పరిమితమయ్యేవారని, తాజాగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీకాంతంను ముఖ్యమంత్రి నియమించడం చాలా సంతృప్తి కల్గించిందని, ఆరు మాసాల్లో ఎన్నో సంక్షేమకార్యక్రమాలు మెరుగ్గా అమలు చేశారని, మరో రెండేళ్లల్లో యూరిపియన్‌ కలెక్టర్‌ను మించిపోతారని 'తుర్లపాటి' ప్రశంసల వర్షం కురిపించారు. తాను కలెక్టర్‌గా నియమితులై కేవలం ఆరు మాసాలు మాత్రమే అయిందని, తాను చేసింది గోరంత.. అని చేయాల్సింది..కొండంత ఉందని అనేక సందర్భాల్లో కలెక్టర్‌ లక్ష్మీకాంతం చెప్పడం జరిగింది. అటు రాజకీయ,అధికార వర్గాలు, మేధావులు, పాత్రికేయులు, సామాన్య ప్రజలు కూడా కలెక్టర్‌ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

(622)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ