WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అద్దంకి' మరో 'కుప్పం' కానుందా...!?

తెలుగుదేశం పార్టీ స్వంత నియోజయకవర్గమైన 'కుప్పం' స్థాయికి 'అద్దంకి'ని తీసుకెళతానన్న ధీమా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వ్యక్తం చేస్తున్నారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా... 'కుప్పం' నియోజకవర్గానికి ఎంత మెజార్టీ వస్తుందో..అంత స్థాయికి 'అద్దంకి'ని తీసుకెళతానని ఆయన అంటున్నారు. మంగళవారం నాడు 'అద్దంకి' నియోజకవర్గంలో 'లోకేష్‌' పర్యటన సందర్భంగానిర్వహించిన బహిరంగ సభకు సుమారు 25వేల మంది ప్రజలు తరలి వచ్చారు. సభకు వచ్చిన ప్రజలను చూసిన 'లోకేష్‌' సంతృప్తి వ్యక్తం చేస్తూ...మీకెప్పుడూ తాను వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులు సహకరించకపోతే 30వేలు 40వేలు సహకరిస్తే 50వేలకు పైగా మెజార్టీ రావడం ఖాయమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి నమ్మకంతో ఉన్నారు. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 'అద్దంకి' నియోజకవర్గ మెజార్టీతో భారీ మెజార్టీ రావచ్చు...లేదా మిగతా నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గినా..ఎంపి మెజార్టీకి ఈ నియోజకవర్గ మెజార్టీయే కారణం అవుతుందని 'రవి' అనుచరులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఐదు వేల పెన్షన్లు ముఖ్యమంత్రితో మంజూరు చేయించుకున్న 'రవి' నియోజకవర్గ అభివృద్ధికి 'లోకేష్‌' ద్వారానే బహిరంగంగా చెప్పించగలిగారు. మరో ఆరు నెలల్లో 'అద్దంకి' రూపు రేఖలు మారడం ఖాయమని, కుప్పం మెజార్టీ తీసుకువచ్చేందుకు..అంతే మెజార్టీ తీసుకువస్తానన్న ధీమాను 'రవి' వ్యక్తం చేశారు.

(362)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ