లేటెస్ట్

'జగన్‌' ఐదు వేల కోట్లు ఇవ్వమంటే...నోటీసులు ఇచ్చారు...!

ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ రకమైన నోటీసులు రావడంపై రాజకీయ దుమారం రేగుతోంది. నిన్న ప్రధాని నరేంద్రమోడీతో సుధీర్ఘంగా సమావేశమైన 'జగన్‌' పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ సొమ్ములను విడదల చేయాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయన గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడిందని చెప్పినట్లు తెలిసింది. మరి ప్రధాని 'జగన్‌'కు ఏ హామీ ఇచ్చారో తెలియదు కానీ..ఆయన అడిగిన సొమ్ములు మాత్రం రాలేదు..ఇదే సమయంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని నోటీసులు మాత్రం వచ్చాయి. పోలవరం విషయంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కొట్లాడు కుంటుంటే...కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి కొర్రీలు వేస్తూ..తన వంతు ఆజ్యం పోస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బిజెపి ప్రభుత్వానికి ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సొమ్ములు చెల్లించకుండా..తాత్సారం చేసిన కేంద్రం...ఐదేళ్ల తరువాత పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పట్లో..ఈ ప్రాజెక్టును నిర్మించనీ యకుండా...తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మించాలనే ఉద్దేశ్యంతో..ఈ రకమైన అడ్డంకులు కల్పిస్తుందేమోన్న శంక సామాన్య ఆంధ్రుల్లో నెలకొని ఉంది.

(493)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ