WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అధికారులూ...ఉద్యోగులూ బందరులోనే ఉండాలి: కలెక్టర్‌ లక్ష్మీకాంతం

కృష్ణా జిల్లాకు చెందిన అధికారుల్లో ఎక్కువ మంది ఒకటి రెండు రోజులు మాత్రమే బందరులో ఉంటూ...మిగతా రోజులన్నీ విజయవాడలో మకాం వేస్తున్నారని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు , ఇతర ముఖ్యులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్‌ స్పందిస్తూ తన ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కృష్ణా జిల్లా కేంద్రమైన బందరులో ఉండాల్సిన వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులు..అనేకమంది విజయవాడలోనే స్థిరనివాసమేర్పరుచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌  జిల్లా స్థాయి అధికారులందరూ బందరులోనే ఉండాలని ఆదేశించారు. ఎవరితే జిల్లా కేంద్రంలో నివాసమేర్పరచుకోలేదో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవైపు కృష్ణా జిల్లా అన్ని విషయాల్లో నెంబర్‌వన్‌ స్థానం దక్కుతుంటే అధికారులు జిల్లా కేంద్రమైన బందరులో ఉండి అందరికీ అందుబాటులో ఉంటే మరింతగా అభివృద్ధి చెందుతామని చెప్పారు. ఎవరైతే అందుబాటులో ఉండరో వారిపై నిఘా కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా తనను మభ్యపెట్టాలనుకున్నా..విజయవాడకే పరిమితమయినా..వారిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయటం జరుగుతుందని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎవరెవరు మచిలీపట్నంలో ఉన్నారో..ఎవరు లేరో వివరాలను పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీటిన్నిటిని పర్యవేక్షించేందుకు డిఆర్‌ఒను ప్రత్యేక అధికారిగా నియమించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్‌తో కూడిన అనుసంధానం తప్పనిసరిగా చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నవంబర్‌ నెలాఖరుకు 70వేల మందికి పట్టాలు పంపిణీ నిర్వహించనున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాలతోనే దీన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ కలెక్టర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఎసి కార్యాలయాలకే పరిమితమైన అధికారులవలే కాకుండా మారు మూల ప్రాంతాలకు లక్ష్మీకాంతం స్వయంగా వెళుతున్నారు..అధికారులను పరుగులు తీయిస్తున్నారు..! విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ అభినందించడం జరిగింది. తక్కువ కాలంలోనే ఎక్కువగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న కలెక్టర్‌గా కృష్ణా జిల్లాలో చిరస్మరణీయంగా మిగిలిపోవడం ఖాయమని ఉద్యోగసంఘాలు చెబుతున్నాయి.

(260)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ