'శ్రీనివాసరాజు' పోటీకి వస్తారనే 'రోజా' విమర్శలు..' 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శ్రీనివాసరాజు' పోటీకి వస్తారనే 'రోజా' విమర్శలు..'

తిరుమల శ్రీవారి దర్శనానికి తాను కోరిన టిక్కెట్లు ఇవ్వనందున జెఇఒపై వ్యక్తిగత విమర్శలు చేసి ఎమ్మెల్యే రోజా అప్రదిష్టపాలయ్యారు. శ్రీవారి బ్రేక్‌ దర్శనాలకు మూడు విధానాలను గత ఐదేళ్లుగా అమలు చేస్తున్నారు. అందులో ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా ఆరుగురిని లిస్ట్‌-1 ద్వారా శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారు. ఈదర్శనానికి కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఐఎఎస్‌ అధికారులు మాత్రమే అర్హత ఉంది. 'రోజా'కు ఈ విషయం తెలుసు. ఇప్పటికే పలుసార్లు ఆమె శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. శ్రీనివాసరాజు నగరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై 'రోజా' దాడికి దిగిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీనివాసరాజు మూటలు ఇస్తున్నారని 'రోజా' చేసిన ఆరోపణలకు, విమర్శలకు అధికార పార్టీ నాయకులే కాకుండా, విపక్షాలకు చెందిన నాయకులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేలపై వివక్ష చూపకుండా నింబంధనల ప్రకారం శ్రీనివాసరాజు టిక్కెట్లు కేటాయించారని, ఆయన ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని, ఇంతకు ముందు ఏ ఒక్కరూ విమర్శలు, ఆరోపణలు చేయని విషయాన్ని 'రోజా' మరిచారు. శ్రీనివాసరాజు 'నగరి'లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయన గెలుపు ఖాయమని..తన ఓటమి తప్పదని తెలుసుకున్న 'రోజా' ఆయనను ఏదో విధంగా బజారున పెట్టాలని ఇంతకు ముందు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా దర్శనాల వివాదాన్ని ఆమె తెరపైకి తెచ్చారు. దీనిపై శ్రీనివాసరాజును కొందరు మీడియా ప్రతినిధులు కలసి ప్రశ్నించగా రాజకీయాల గురించి అడగవద్దని, తాను నిబంధనల ప్రకారమే టిక్కెట్లు ఇచ్చామని, అర్హత ఉన్నవారికి ఇంతకు ముందు ఎలా ఇచ్చామో..ఆమెకు అదే విధంగా ఇచ్చామని, మరో ఐదు టిక్కెట్లు అదనంగా ఆమెకు ఇచ్చామని, ఆమె తనపై ఆరోపణలు, విమర్శలు చేయటం బాధ కల్గిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

(299)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ